ఆయన ఓ టైమ్ లో తెలుగులో ఓ ఊపు ఊపాడు. అయితే మధ్యలో సినిమాలు తగ్గాయి. వయస్సు ప్రభావం కూడా బాగా కనపడింది. అయితే అనుకోని విధంగా ఓ హిట్ పడి..మళ్లీ లైమ్ లైట్ కు వచ్చాడు. ఆచి,తూచి అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా అన్నట్లు చేస్తున్నాడు. కారణం మా పిల్లల కెరీర్ మీద కాన్సర్టేట్ చేస్తున్నా అని చెప్పేవాడు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా ఎక్కడా కనపడటం లేదు. రీసెంట్ గా రిలీజైన ఆయన పాత సినిమా పబ్లిసిటీకు సైతం హాజరవ్వలేదు. దాంతో అసలు ఏమైంది అంటే తీవ్రమైన అనారోగ్యం చేసింది ఆయనకు అని తెలిసింది.

అందుకే ప్రపంచానికి దూరంగా ,పబ్లిక్ లోకి రాకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ కాలక్షేపం చేసాడు. అయితే తాజాగా ఆయన పూర్తిగా కోలుకున్నాడట. ఆఖరి క్షణాలు దాకా వెళ్లి వచ్చిన అతన్ని ..ఈ విషయం తెలిసిన కొందరు వెళ్లి పరామర్శించి వస్తున్నారట. మరికొద్దిరోజుల్లోనే కొత్త సినిమా ప్రకటించేటంత ఊపులో ఉన్నాడట. ఆ మేరకు ఓ డైరక్టర్ ని ఫైనలైజ్ చేసి, స్క్రిప్టు డిస్కషన్స్ లో కూర్చుందామనుకుంటున్నారట. యాక్షన్ సినిమా చేద్దామని ఆయన అంటూంటే...మరో హీరోతో కలిసి చేయమని ఫ్యామిలిలో అంటున్నారట.
 
అలాగే  ఆమధ్య ఓ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ అంతలోనే ఆపేశారు. ఆనారోగ్య కారణాల వల్లనే ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ నటుడు తప్పుకున్నాడంటూ అప్పట్లో మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాతే అదే నిజమని ఇప్పుడు అందరికీ అర్దమైంది.  ఇప్పుడిప్పుడే ఆ సీనియర్   హీరో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. నలుగురితో కలస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు. అయితే ఆయనకు వచ్చిన ఆ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటనే విషయాన్ని మాత్రం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు.