Asianet News TeluguAsianet News Telugu

టాప్ మూవీ న్యూస్: చంద్రయాన్ 2పై మహేష్- మతిపోగొట్టే భంగిమలతో డాన్స్

సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..   

 

Saturday Tollywood top movie news
Author
Hyderabad, First Published Sep 7, 2019, 3:10 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మతిపోగొట్టే భంగిమలతో డాన్స్.. గాయాలపాలైన హీరోయిన్!

Vaani Kapoor got injured in War movie sets

పొడుగు సుందరి వాణి కపూర్ ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రంలో నటిస్తోంది. క్రేజీ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న వార్ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. 

చంద్రయాన్ 2: 'మహర్షి' డైలాగ్ తో ఇస్రోపై మహేష్ ప్రశంసలు!

Mahesh Babu about Chandrayaan 2

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మహేష్ మహర్షి చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. 

చంద్రయాన్ 2: సిగ్గులేని చర్య అంటూ విరుచుకుపడ్డ మంచు మనోజ్!

Tollywood celebrities response on chandrayaan 2

యావత్ భారత దేశంతో పాటు, ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. శనివారం తెల్లవారు జామున చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగే మధుర క్షణాలని ఆస్వాదించేందుకు దేశ ప్రజలంతా ఎదురుచూశారు.

బిగ్ బాస్ : కింగ్ ఈజ్ బ్యాక్.. అందరికి ఒక రౌండ్ కోటింగ్!

King nagarjuna is back to Bigg Boss 3

కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మళ్ళీ వచ్చేశాడు. గత వారం పుట్టినరోజు సందర్భంగా నాగార్జున ఫ్యామిలీతో కలసి వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో గత శని, ఆదివారాలు రోజు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హాట్ గా వ్యవహరించారు. నాగ్ వెకేషన్ నుంచి తిరిగి వచేసాడు. బిగ్ బాస్ హోస్ట్ గా వేదికపైకి ఎంటర్ అయిపోయాడు. 

ట్రాఫిక్ రూల్స్.. సీఎంకి హీరోయిన్ కౌంటర్

heroine sonugowda counter to karnataka cm

ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే   సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు. 

చిరంజీవికి అరవింద స్వామి డబ్బింగ్‌..?

Aravinda Swamy dubbing to Chiranjeevi for Syera

స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బ్లాక్ బస్టర్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్ తోనా.. రామ్ కొత్త సినిమా?

Interesting details on Ram Pothineni and VV Vinayak combination

నేను శైలజ చిత్రం తర్వాత రామ్ నటించిన హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ, హాలోగురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ప్రస్తుతం రామ్ నటించబోయే తదుపరి చిత్రం వార్తలు వస్తున్నాయి. 

లీక్: బన్ని ‘అల వైకుంఠపురములో’కథ ఇదే

కారు డ్రైవర్..కోటీ శ్వరుడు: మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... జయరాం, మురళి శర్మ లలో ఒకరిది కోటిశ్వరుడు కుటుంబం, మరొకటి లో మిడిల్ క్లాస్ కుటుంబం. వాళ్లిద్దరికి సోషల్ స్టేటస్ లో కానీ, ఎకనామిక్ స్టేటస్ లో కానీ పోలిక ఉండదు. జయరామ్ ,టబులకు అల్లు అర్జున్ పుడతాడు. పుట్టుకతోనే కోటిశ్వరుడు. మరో ప్రక్క వాళ్ల కారు డ్రైవర్ మురళి శర్మ కు సుశాంత్ పుడతాడు. వీళ్లిద్దరి పుట్టుక ఒకే సారి జరుగుతుంది. జయరాం, మురళి శర్మ  ఇద్దరూ స్నేహితుల్లా మెలుగుతారు. ఈ క్రమంలో వాళ్ల పిల్లల భవిష్యత్ గురించి ఓ డిస్కషన్ వస్తుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం  ‘అల వైకుంఠపురములో’. ఈ  సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈ సినిమా టీమ్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios