వార్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలని చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ప్రచారంలో ప్రత్యేక సరళిని అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్ కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. 

ఈసారి చిత్ర యూనిట్ వాణికపూర్ డాన్స్, గ్లామర్ షో గురించి వివరించారు.  ఈ చిత్రంలో భారీ హంగులతో హృతిక్, వాణి కపూర్ మధ్య పార్టీ సాంగ్ ని తెరకెక్కించారు. ఈ సాంగ్ లో వాణి కష్టం వెండితెరపై కనిపిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. తన అందాలతో ఆకట్టుకుంటూనే మతిపోగోట్టే విధంగా డాన్స్ చేసిందని సిద్దార్థ్ వివరించారు. 

ఈ సాంగ్ లో వాణికపూర్ పోల్ డాన్స్, వీల్ డాన్స్ విన్యాసాలు అద్భుతంగా ఉంటాయట. ముఖ్యంగా పోల్ డాన్స్ పర్ఫెక్ట్ గా చేయడం కోసం వాణి కపూర్ దాదాపు మూడు నెలలు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. చాలా సందర్భాల్లో వాణి కపూర్ గాయాలపాలైంది. కొన్ని రిస్కీ డాన్స్ మూవ్స్ లో బాడీ డబుల్ ఉపయోగిస్తే బావుంటుందని సూచించినా నిరాకరించింది. సొంతంగానే కష్టపడి అద్భుతంగా డాన్స్ చేసింది అని సిద్దార్థ్ ఆనంద్ ప్రశంసించారు. 

ఈ చిత్రంలో హృతిక్, వాణి కపూర్ మధ్య రొమాన్స్ ప్రేక్షకులని కట్టిపడేయడం ఖాయమట. ఇటీవల విడుదల చేసిన సాంగ్ లో వాణి కపూర్ బికినిలో సైతం అందాలు ఆరబోసింది. హృతిక్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ తో అదరగొట్టేందుకు సిద్ధం అవుతుండగా.. గ్లామర్ షోతో ప్రేక్షకులని వాణి తనవైపు తిప్పుకోనుందట.