Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్ 2: సిగ్గులేని చర్య అంటూ విరుచుకుపడ్డ మంచు మనోజ్!

యావత్ భారత దేశంతో పాటు, ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. శనివారం తెల్లవారు జామున చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగే మధుర క్షణాలని ఆస్వాదించేందుకు దేశ ప్రజలంతా ఎదురుచూశారు.

Tollywood celebrities response on chandrayaan 2
Author
Hyderabad, First Published Sep 7, 2019, 5:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చంద్రయాన్ 2లో అంతా సవ్యంగా జరిగిపోతోంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారు. కానీ కేవలం చంద్రుడికి 2.1 కిమీ దూరంలో ఇస్రోకు, విక్రమ్ ల్యాండర్ కు కమ్యూనికేషన్ కట్ అయింది. దీనితో ఇస్రో శాస్త్రవేత్తలంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇస్రో చైర్మన్ శివన్ ప్రధాని మోడీని కౌగిలించుకుని కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు దేశ ప్రజలందరినీ కలచి వేశాయి. ఇస్రో గొప్ప ప్రయత్నం చేసింది. విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ కట్ అయినప్పటికీ ఇది విజయమే. శాస్త్రవేత్తల కృషి మరువలేనిది అంటూ ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు ఇస్రోకు అండగా నిలుస్తున్నారు. 

టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 

మన ఇస్రో శాస్త్రవేతలు సాధించిన అన్ని ఘనతలు చూస్తుంటే గర్వంగా ఉంది. మనం కొంత విజయం సాధించాం.. కొంత నేర్చుకున్నాం. ఇలాంటి సమయంలో ఇస్రోకి ఒక పిల్లర్ లా అండగా నిలిచినా ప్రధానికి ధన్యవాదాలు. మెరుపు వేగంతో మనం పుంజుకోవాలి అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. 

 

ప్రతి జర్నీలో ఒడిదుడుకులు సహజమే. మీరు సాధించిన ఘనత అద్భుతమైనది. ఇలాంటి సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలబడుతున్న దేశ ప్రజలతో నేను కూడా జాయిన్ అవుతున్నా. ఇస్రో మనల్ని చంద్రుడికి దగ్గరగా తీసుకెళ్లింది. మీరు హృదయాలు గెలుచుకున్నారు అని దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. 

కేవలం 2 కిమీ దూరంలో మిస్ కావడం ఇస్రో శాస్త్రవేత్తల హృదయాలు బరువెక్కే అంశమే. ఏది ఏమైనా మేమంతా మీతో ఉన్నాము. మళ్ళీ బలంగా పుంజుకొండి అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు. 

మీరు నిజమైన రాక్ స్టార్స్.. మిమ్మల్ని ఇలా చూడడం హృదయాలు బద్దలయ్యేలా చేస్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా మీ సొంతం అంటూ హీరోయిన్ పూజా హెగ్డే ట్వీట్ చేసింది. ఇస్రో చైర్మన్ శివన్ విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ మిస్ ఐన తర్వాత చాలా భాదతో ప్రకటన చేస్తున్న ఫోటోని షేర్ చేసింది. 

చంద్రుడి దక్షిణ దృవం పై చంద్రయాన్ ప్రాజెక్ట్.. చాలా రిస్క్ ఉందని తెలిసినా మన సైంటిస్టులు ధైర్యంగా ప్రయత్నించారు. భవిష్యత్తులో స్పేస్ లో సరికొత్త ఆవిష్కరణలకు ఇది పునాది అని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేసాడు. 

ఏం జరిగిన పర్వాలేదు.. ఇస్రో భావితరాలకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తోంది. మీరు దీనినుంచి త్వరగా బయట పెడతారనే నమ్మకం ఉందని మంచు మనోజ్ తెలిపాడు. ఇక విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ కట్ ఐన అనంతరం కొందరు ఇస్రో సైంటిస్ట్స్ మీడియా ముందుకు వెళ్లారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి చేసిన అతి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలంతా చాలా ఒత్తిడిలో, బాధలో ఉన్న సమయంలో.. ఇస్రో చైర్మన్ మీడియా ముందుకు ఎందుకు రాలేదు.. మీడియాని పఫేస్ చేసే ధైర్యం ఎందుకు చేయలేదు అంటూ గట్టగా కేకలు వేశాడు. ఈ వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన మంచు విష్ణు.. సిగ్గులేని చర్యగా అభివర్ణించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios