- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్
Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 10వ తేదీ)లో డాక్టర్ ని ప్రామిస్ చేయమన్న శౌర్య. శ్రీధర్ లో మొదలైన అనుమానం. దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యోత్స్న. నిజం అందరికీ చెప్పేస్తానన్న దశరథ. బ్రతిమాలిన దాసు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్‌లో కార్తీక్ గారు వచ్చారా.. మీరు రాగానే డాక్టర్ గారు చెప్పమన్నారు. దీపకు కొన్ని టెస్టులు చేయాలట. గైనకాలజిస్టు వచ్చారు అని చెప్తుంది నర్స్. దీప లోపలే ఉంది కదా.. టెస్టులు చేయకపోయారా అంటాడు నర్స్. మీ నాన్న, కూతురు వచ్చారు. తనతో మాట్లాడుతున్నారని చెబుతుంది నర్స్. నాన్న, శౌర్యను ఎందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను దాంతో ఏం చెప్పాలి అనుకుంటాడు కార్తీక్.
నాన్న నాకు ఎందుకు అబద్ధం చెప్పాడమ్మా అని దీపను అడుగుతుంది శౌర్య. తను దీప కోసం ఏడ్చింది. నీకు ఫోన్ చేశాను కనెక్ట్ కాలేదు. ఇక తీసుకురాక తప్పలేదు అని చెప్తాడు శ్రీధర్. అమ్మకు జ్వరం వచ్చింది, అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చాను. డాక్టర్ చెప్పే వరకు అమ్మ ఇక్కడే ఉండాలి అని చెప్తాడు కార్తీక్. నీకు జ్వరం వస్తే, బేబికి కూడా జ్వరం వస్తుందా అమ్మ. తనని జాగ్రత్తగా చూస్కో అని ఒక బొమ్మను ఇస్తుంది శౌర్య. నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉంటావు కదా.. ఈ బొమ్మను పక్కన పెట్టుకో అమ్మ అని చెబుతుంది.
శ్రీధర్‍లో మొదలైన అనుమానం
కాసేపటి తర్వాత గైనకాలజిస్ట్‌తో కలిసి డాక్టర్ హారిక అక్కడికి వస్తుంది. దీపకు టెస్టులు చేయాలని హారిక అంటే.. మీరు ఎన్ని టెస్టులైన చేయండి. కానీ, తల్లీ బిడ్డలను కాపాడండి అంటాడు శ్రీధర్. అదేంటి వద్దు అనుకున్నారు కదా అంటుంది గైనకాలజిస్ట్. వద్దు అనుకోవడం ఏంటి అని అడుగుతాడు శ్రీధర్. కార్తీక్, డాక్టర్ హారిక కవర్ చేస్తారు.
మీరు ఇద్దరూ ఇంటికి వెళ్లండి అని చెప్తాడు కార్తీక్. మా అమ్మను, బేబిని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ తో చెప్తుంది శౌర్య. బాగా చూసుకుంటానని ప్రామిస్ చేయమంటుంది. కార్తీక్ అలా మాట్లాడకూడదు రౌడీ అని చెప్పడంతో సైలెంట్ గా వెళ్లిపోతుంది.
దీపను ఊహించని విధంగా చంపేస్తాను
నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాం. మళ్లీ ఈ రోజే కలవాలని ఎందుకు పిలిచావ్ నాన్న అని దాసును అడుగుతుంది జ్యోత్స్న. నేను మీ నాన్నను కాదు అని చెప్పడానికి పిలిచాను. నువ్వు లేనిపోని భయాలు మోసుకుంటూ తిరుగుతున్నావ్ అంటాడు దాసు. నేను నీ కూతురు కాదని చచ్చిపోయిన నీ భార్యపై ఒట్టు వేసి చెప్పు అంటుంది జ్యోత్స్న. షాక్ అవుతాడు దాసు. చనిపోయిన వాళ్లమీద ఒట్టులు ఎందుకులే అమ్మ అంటాడు దాసు.
నువ్వు వేయలేవు. ఎందుకంటే నీకు తెలుసు నేనే నీ కూతురుని అని. కానీ డాక్టర్ నన్ను సుమిత్ర కూతురు అంటోంది. నాకు ఆ విషయంలో అనుమానంగానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. మీరంతా కలిసి నా వెనకాల ఏదైనా చేస్తే మాత్రం నేను దీపను బతకనివ్వను. ఒకవేళ నేను చచ్చినా సరే దీపను చంపే ఏర్పాట్లు ఆల్రెడీ చేశాను. దీపను ఊహించని విధంగా చంపుతాను. ఎప్పుడు, ఎలా చంపుతానో కూడా తెలియదు, నేను ఆ ఇంటి వారసురాలి స్థానంలో ఉన్నంత వరకే దీప బతుకు అని దాసుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఆ మాటలు చాటుగా నిలబడి వింటాడు దశరథ.
కార్తీక్ ని కూడా క్షమించను..
శౌర్యను తీసుకెళ్లినందుకు కార్తీక్ ఏమైనా అన్నాడా అని అడుగుతుంది కాంచన. కార్తీక్ ఏం అనలేదు కానీ.. డాక్టర్ ఒక మాట అంది. ఆ మాట వింటే కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడని అనిపిస్తోంది. అదేంటో నేనే తెలుసుకుంటాను అంటాడు శ్రీధర్. అగ్రిమెంట్ విషయంలో కూడా కార్తీక్ అలాగే చేశాడు. పిల్లలు వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకుందామని అనుకుంటారు. కానీ అక్కడే ఏదో పెద్ద నష్టం జరుగుతుంది అంటాడు శ్రీధర్. అప్పుడు నా కోడలినే కాదు కొడుకును కూడా క్షమించను అంటుంది కాంచన.
నిజం అందరితో చెప్పేస్తాను..
జ్యోత్స్న వెళ్లగానే దాసు దగ్గరికి వస్తాడు దశరథ. ఇప్పుడైనా నీకు అర్థం అయిందా అన్నయ్య... మేము నిన్ను నిజం చెప్పకుండా ఎందుకు ఆపుతున్నామో అని అంటాడు దాసు. అలా అని జ్యోత్స్న ఏం చేసినా చూస్తూ ఊరుకుంటామా.. ఇప్పుడే నిజం అందరితో చెబుతాను. తను ఏం చేస్తుందో నేను చూస్తాను అంటాడు దశరథ.
తన మాటలు ఎంత పదునుగా ఉన్నాయో చూశావు కదా అన్నయ్య. తను కిరాతకురాలు. కచ్చితంగా దీపను చంపేస్తుంది. మనం మౌనంగా ఉండటమే మంచిది అంటాడు దాసు. ఇప్పటిదాకా నా కూతురు పడ్డ కష్టాలు చాలు. ఇక నేను ఊరుకోను అని ఆవేశంగా వెళ్లిపోతుంటాడు దశరథ. జ్యోత్స్న మంచిది కాదు అన్నయ్య. తను ఏదో ప్లాన్ చేసింది. నా మాట విను, నువ్వు ఏం చేయకు అని దశరథను రిక్వెస్ట్ చేస్తాడు దాసు.
ఆలోచనల్లో దీప
మరోవైపు శౌర్య ఇచ్చిన బొమ్మను పట్టుకొని శౌర్య మాటలు, కడుపులో బిడ్డను గుర్తు చేసుకొని బాధపడుతుంది దీప. కార్తీక్ ఒదార్చుతాడు. ముందు టిఫిన్ చెయ్. అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్తాడు కార్తీక్. నువ్వు ఇలా డల్ గా ఉండటం నాకు ఇష్టం లేదు కాస్త నవ్వు దీప అని చెక్కిలిగింతలు పెడతాడు కార్తీక్. దీప నవ్వుతూ ఆగు బావ అంటుంది. ఇదిగో ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

