ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే   సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు. 

హీరోయిన్ సోను గౌడ ట్విట్టర్ ద్వారా బెంగ‌ళూరు ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌ను ప్రశ్నించారు. జరిమానా రూపంలో ప్రజల సొమ్మును బాగానే వసూలు చేస్తున్నారు. అలా చేయడం తగదు. ముందు ప్రజలకు సరైన రోడ్లు వేయించండి అంటూ వర్షంలో ఒక వాహనదారుడు కింద పడిన ఫొటోను కూడా సోనుగౌడ పోస్ట్ చేశారు. సెల్‌ఫోన్ వాడితే రూ.5వేలు.. మ‌ద్యం తాగితే రూ.10 వేలు ఫైన్ వేస్తున్న ప్రభుత్వానికి రోడ్లు బాగాలేక పోతే ఎంత  జరిమానా ఎంత విధించాలి అని సూటిగా పేర్కొన్నారు.