ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2 చివరి దశ వరకు చేరుకొని నిరాశపరిచింది. గత రాత్రి చంద్రయాన్ 2 లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలవల్ల కేవలం చందమామకు 2 కిమీ దూరంలో విక్రమ్ నుంచి ఇస్రోకు సంకేతాలు నిలిచిపోయాయి. దీనితో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ప్రయోగం చివరి వరకు విజయవంతంగానే కొనసాగింది. చివర్లో నిరాశపరిచినప్పటికీ ఇస్రో శాత్రవేత్తల పడ్డ శ్రమ మరిచిపోలేనిది. దీనితో సెలెబ్రిటీలు ఇస్రోకు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ట్విట్ చేశాడు. ఇస్రో శాత్రవేత్తలని అభినందిస్తూ మహర్షి చిత్రంలోని డైలాగ్ గుర్తుచేసుకున్నాడు. 'సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్.. ఇట్స్ ఎ జర్నీ.. చంద్రయాన్ 2 ద్వారా ఇస్రో చారిత్రాత్మక జర్నీ కొనసాగించింది. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి సైంటిస్ట్ కు సెల్యూట్ చేస్తున్నా.. మీరే నిజమైన హీరోలు. మేమంతా మీతో ఉన్నాం. విజయానికి ఇది ఆరంభం మాత్రమే అని మహేష్ ట్విట్టర్ లో స్పందించాడు.