గతవారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. దీనితో ఈ వీకెండ్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఇదిలా ఉండగా నాగార్జున రాగానే హౌస్ మేట్స్ ని క్లాస్ పీకడం ప్రారంభించేశాడు. ఈ వారం జరిగిన టాస్క్ లలో ఒక్కొక్కరు చేసిన తప్పులని ఎత్తిచూపుతూ షోలో వార్నింగ్ ఇస్తున్నాడు. 

నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున పునర్నవిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇంటి సభ్యులందరికి కొరకరాని కొయ్యగా మారిన పునర్నవి నాగార్జున వద్ద కూడా గట్టిగానే వాదిస్తోంది. 

ఇక దొంగల టాస్క్ లో తాను ప్రవర్తించిన విధానాన్ని అలీ రెజా నాగార్జున వద్ద సమర్థించుకుంటున్నారు. ఈ వారం నామినేషన్ లో మహేష్, రవి, అలీ రెజా, శ్రీముఖి, రాహుల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.