Asianet News TeluguAsianet News Telugu

సమంత ..పివి సింధు బయోపిక్, అసలు నిజం ఇదీ

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి  స్పెయిన్ లో  వెకేషన్ మూడ్ లో  ఉంది సమంత. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
 

Samantha denies P V Sindhu biopic
Author
Hyderabad, First Published Sep 3, 2019, 5:31 PM IST

 

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి  స్పెయిన్ లో  వెకేషన్ మూడ్ లో  ఉంది సమంత. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలు ప్రకారం  వాస్తవానికి సోనూసూద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ హీరోయిన్‌తో తెర‌కెక్కించాల‌నుకున్నార‌ట‌. అయితే ఫైనాన్సియల్ గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఈ సినిమాను స‌మంతతోనే చేయాల‌నుకుంటున్నార‌ట. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని, త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్తున్నారు. అయితే సమంత కు చెందిన సన్నిహిత వర్గాల ద్వారా అసలు అలాంటి ప్రపోజల్ ఏదీ ఆమె వద్దకు రాలేదని తెలుస్తోంది. అంతేకాదు ఆమెకు అలాంటి బయోపిక్ చేసే ఆలోచన కూడా లేదని తెలుస్తోంది. 

పివి సింథు పాత్ర చేయాలంటే ఫిజికల్ గా బాగా స్ట్రెంత్ ఉండాలి.  వచ్చే సంవత్సరం తల్లి అవాలని సమంత ప్లాన్ చేసుకుంటోందిట. ఇలాంటి టైమ్ లో ఇలాంటి రిస్క్ లు చేయటం అనవసరం అనుకుంటోందిట. అంతేకాక బయోపిక్ లు తెలుగులో వర్కవుట్ అవటం కష్టమని భావిస్తోందిట. పివి సింధు బయోపిక్ అంటే క్రీడలు, అదీ బ్యాడ్మెంటన్ మీద అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే చూస్తారని , ఓ రకంగా రిస్క్ అని ఆమెను వారించే అవకాసం ఉందిట. ఇవన్నీ కాకుండా పివి సింధు చాలా పొడగరి అని, సమంత నార్మల్ హైట్ అని తేలుస్తున్నారు. 

ప్రస్తుతం సమంత కొత్త ప్రాజెక్టులు ఏమీ కమిటవ్వలేదు. ప్రస్తుతం స్పెయిన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. తన భర్తతో కలిసి అక్కడ విహరిస్తున్న ఆమె రేపో ఎల్లుండో హైదరాబాద్ వస్తారు. వచ్చాక ఏ కొత్త ప్రాజెక్టు కమిటవ్వలనేది ఆలోచిస్తుందిట. `యూ ట‌ర్న్‌`, `ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు `రంగ‌స్థ‌లం`, `మ‌జిలీ` వంటి చిత్రాల‌తో న‌టిగా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రయ్యారు అక్కినేనివారి కోడ‌లు సమంత. ఈ ఏడాది `ఓబేబీ`తో స‌క్సెస్ అందుకున్న స‌మంత అక్కినేని త‌దుప‌రి త‌మిళ చిత్రం `96` తెలుగు రీమేక్‌లో న‌టిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios