అఖిల్ లాంటి మీడియం హీరో కు జరిగే బిజినెస్ అంటే ఓ మాదిరిగా ఉంటుంది. అందులోనూ కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క హిట్ కొట్టని అఖిల్ ప్లేస్ లో వేరే హీరో ఉంటే నిర్మాతలు రూపాయి కూడా ఖర్చు పెడటానికి ఇష్టపడరు. అయితే అఖిల్ వచ్చింది అక్కినేని క్యాంప్ నుంచి, తండ్రి పెద్ద హీరో, వెనక అన్నపూర్ణ బ్యానర్, ఇన్ని ఉండటంతో అఖిల్ సినిమాల బడ్జెట్ లకు ఎప్పుడూ కంట్రోలు ఉండటం లేదు. తాజాగా ఆయన కమిటైన కొత్త చిత్రానికి ఏకంగా 45 కోట్లు పెడుతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అఖిల్ తదుపరి సినిమాని సురేంద్రరెడ్డి డైరక్ట్ చేయనున్నారు. సురేంద్రరెడ్డి సినిమా అంటే సాధారణంగా చాలా లావిష్ బడ్జెట్ తో కూడి ఉంటాయి. ఈ క్రమంలోనే 45 కోట్ల బడ్జెట్ ని నిర్మాతకు ఎస్టిమేట్ వేసి ఇవ్వటం జరిగిందిట. ఈ సినిమాని క్రిష్ కు చెందిన ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నారు. ఇప్పుడీ బడ్జెట్ చూసి అఖిల్ మీద తర్వాత అంత బిజినెస్ చేయలేమని ఏం చేయాలా అని ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు.
  
అయితే సురేంద్రరెడ్డి మాత్రం తాను బడ్జెట్ విషయంలో తగ్గేది లేదని చెప్పారట. అసవరం అనుకుంటే వేరే నిర్మాతతో ముందుకు వెళ్దామని అఖిల్ తో అన్నారట. అఖిల్ సైతం ఇదే బడ్జెట్ కు కట్టుబడి ఉన్నారట. ఇప్పటికే నాగార్జున ...కథ, అఖిల్‌ క్యారెక్టర్‌ బాగుండటంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. రవితేజ హీరోగా తాను గతంలో తెరకెక్కించిన ‘కిక్‌’ సినిమా తరహాలో ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. అఖిల్‌ క్యారెక్టర్‌ చాలా జోష్‌గా ఉంటుందని తెలిసింది. 

మరో ప్రక్క సురేంద్రరెడ్డి వేరే స్క్రిప్టుని పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేస్తున్నారట. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఆ సినిమా తెరకెక్కించాలనే నిర్ణయంలో ఉన్నారట. అఖిల్ విషయానికి వస్తే....ప్రస్తుతం అతను నటిస్తోన్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. పరిస్థితులు మామూలు స్థితికి రాగానే మొదట విడుదలయ్యే సినిమాల వరుసలో ఈ సినిమా కూడా ఉంటుంది.