ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. రియా చక్రవర్తి పరోక్ష వ్యాఖ్యలు, గత ఏడాది ఆమె కూడా..
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖండ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖండ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గత వారం ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కాయాల్సి క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే.
రేవ్ పార్టీలో నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు ఎన్సీబీ అధికారులు సమాచారం అందుకోవడంతో రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నాడు. షారుఖ్ తన కుమారుడి కోసం బెయిల్ కి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదు. బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరిస్తూనే ఉంది.
మరికొంతకాలం Aryan Khan ని విచారించాలని ఎన్సీబీ కోర్టుని కోరుతోంది. దీనితో షారుఖ్ ఫ్యామిలీ తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై పరోక్షంగా పోస్ట్ పెట్టింది. 'మీకు ఎదురయ్యే సంఘటనలతోనే ఎదుగుతారు' అంటూ Rhea Chakraborty కామెంట్ పెట్టింది. డ్రగ్స్ కేసుతో ఆర్యన్ ఖాన్ మరింత దృడంగా తయారు కావాలని రియా కోరుకుంటుందేమో. గత ఏడాది రియా చక్రవర్తి కూడా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంది.
దాదాపు నెల రోజుల పాటు రియా పోలీస్ కస్టడీలో గడిపింది. రియా తరుపున వాదించిన లాయర్ సతీష్ మనషిండే.. ఆర్యన్ ఖాన్ కేసుని కూడా వాదిస్తున్నారు. ఏది ఏమైనా షారుఖ్ ఫ్యామిలీ ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.