Asianet News TeluguAsianet News Telugu

శ్రీనువైట్లకు అండగా నిలిచిన ప్రముఖ హీరో

  • పరాజయాలతో సతమతమవుతున్న స్టార్ డైరెక్టర్
  • మిస్టర్ తో మరోసారి దెబ్బతిన్న శ్రీను వైట్ల
  • అండగా నిలిచిన అగ్రహీరో
ravi teja ready to do movie in srini vaitla direction

‘విలన్ ఇంట్లో కి హీరో చేరి.. వారిని బకరాలు చేసి ఆడించి చివరకు విజయం సాధిస్తాడు.’ ఈ లైన్ తో తెలుగులో ఇప్పటికి చాలా సినిమాలో వచ్చాయి. అయితే.. ఆ సినిమాకు మొదట ఆజ్యం పోసిన డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ రకం ట్రెండ్ ని ఆయన రెడీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఆ ఫార్ములాని ఉపయోగించుకొని హిట్లు కొట్టిన హీరోలు, దర్శకులు కూడా ఉన్నారు. అంతేకాదు.. ప్రిన్స్ మహేష్ బాబుకి దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అప్పుడు శ్రీను వైట్లకు బ్రహ్మరథం పట్టారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. తీసిన సినిమాలు డిజాస్టర్ల రూపంలో ఆయనను వెక్కిరించాయి.

 

బాగా ఆశలు పెట్టుకొని తీసిన మిస్టర్ సినిమా మళ్లీ నిరాశనే మిగిల్చింది. దాంతో అగ్రదర్శకుడిగా ఉన్న శ్రీను వైట్లకు చాలా మంది ముఖం చాటేశారు. కానీ పడిలేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. తాజాగా శ్రీనువైట్లకు ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ హీరో దన్నుగా నిలిచారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

 

మిస్టర్ సినిమా ప్లాప్ తో.. శ్రీను వైట్ల పరిస్థితి దారుణంగా మారిపోయందని.. ఆస్తులన్నీ అమ్ముకున్నాడనే .. ఆఖరిని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దూకుడు చిత్రం తీసిన 14రీల్స్  ఓ సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 2 కోట్లు అడ్వాన్స్ తీసుకొని.. 'దూకుడు' షూటింగ్ సమయంలోనే శ్రీను వైట్ల టాలెంట్ చూసి 14రీల్స్  సంస్థ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి రూ. 2 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. కానీ పరిస్థితులకు కారణంగా శ్రీను వైట్ల 14రీల్స్ కి  కాకుండా వేరే నిర్మాణ సంస్థలకు సినిమా చేసి పెట్టాడు. అయితే ఆ సినిమా అలానే పెండింగ్ లో ఉండిపోయింది. శ్రీను వైట్ల తీసిన సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో సదరు నిర్మాతలు వెనకడుగు వేశారట.

 

ప్రస్తుతం ఫెయిల్యూరు రికార్డు ఉన్న శ్రీను వైట్లతో సినిమా తీయడం ఇష్టం లేక అడ్వాన్స్ గా ఇచ్చిన రెండు కోట్లు తిరిగి ఇవ్వాలని 14రీల్స్ అధినేతలు అడిగారట. అందుకు తన పరిస్థితి ఇప్పుడు బాగోలేదని, కావాలంటే మరో సినిమా చేస్తానని నిర్మాతలకు స్పష్టం చేశారంట. శ్రీను వైట్ల పరిస్థితిని అర్థం చేసుకుని నిర్మాతలు సానుకూలంగా స్పందించారనేది తాజా సమాచారం.

 

 అయితే.. హీరోని మాత్రం మీరే వెతుక్కోవాలని14రీల్స్  చెప్పగా.. శ్రీను వైట్లతో సినిమా తీయడానికి ఆయన మిత్రుడు రవితేజ అంగీకరించినట్టు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కనుక హిట్ అయితే.. శ్రీను వైట్ల మళ్లీ అగ్ర దర్శకుడిగా మారతాడనడంలో సందేహం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios