Asianet News TeluguAsianet News Telugu

ఇలాగే చేస్తూ పోతే నాకు బ్యాక్ పెయిన్ రావటం ఖాయం

ఇలాగే చేస్తూపోతే తనకు వయసు పెరిగిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడం ఖాయమని అంది. అయినా కలిసిన ప్రతీసారి ఇదే ఎందుకు అడుగుతారు, 

Rashmika Mandanna said she wont dance to pushpa song
Author
First Published Mar 23, 2023, 3:35 PM IST


కన్నడ  భామ రష్మిక మందన్న తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.  నితిన్ తో చేసిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన రష్మిక వరస సక్సెస్ లతో ... దూసుకుపోతోంది. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తోంది.  అదే సమయంలో నటనతో పాటు తన అభిమానులతో ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటూంటుంది.  అందుకే  రష్మిక మందన్న పేరు టిట్టర్‌లో ట్రెండ్ అవుతూంటుంది.

  ఇటీవల రష్మిక తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాను ‘‘పుష్ప.. సినిమాలో ‘సామి సామి’ సాంగ్ కు మీతో కలసి డాన్స్ చేయాలనుంది’ అని అడిగితే ఆ ప్రశ్నకు రష్మిక తన స్టైల్ లో సమాధానమిచ్చింది. ‘సామి సామి’ పాటకు ఇక తాను డాన్స్ చేయనని బదులిచ్చింది. ఇప్పటికే ఈ పాటకు చాలా సార్లు డాన్స్ చేశానని, ఇలాగే చేస్తూపోతే తనకు వయసు పెరిగిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడం ఖాయమని అంది. అయినా కలిసిన ప్రతీసారి ఇదే ఎందుకు అడుగుతారు, ఈసారి కొత్తగా చేద్దామని చెప్పింది. దానికి నిజమే అంటూ రష్మిక పరిస్దితిని అర్దం చేసుకుంటున్నారు అభిమానులు. 

ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీ తో పాటు ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వం వహిస్తోన్న ‘యానిమల్’స సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే తాజాగా మరో సినిమా కమిటైంది.  

వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం పూర్తిగా వినోదాల్ని అందించడంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబధించిన మంచి సందేశం ఇచ్చింది. ఉగాది శుభ సందర్భంగా #VNRTrio కాంబినేషన్లో కొత్త చిత్రం ఒక ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఆ వీడియోలో నితిన్, రష్మిక మందన, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని చెప్పారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా వుంది.

Follow Us:
Download App:
  • android
  • ios