ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత వచ్చిన గీతగోవిందంతో స్టార్ అయిపోయింది. ఆ తరవాత వరసపెట్టి దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాపులు వచ్చినా కూడా వెనకడుగు పడలేదు. మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చేసింది. భీష్మతో మరో సక్సెస్ కూడా అందుకుని ఇప్పుడు ప్రతీ హీరో తన ప్రక్కన ఆమెను కోరుకునే స్దాయి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానం కోసం పూజా హెగ్డేతోనే పోటీ పడుతుంది రష్మిక మందన్న. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమెకు క్యూ లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది రష్మిక. ఖాళీ ఉంటే రోజులో ఎక్కువ భాగం జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. దాంతో పాటు బయట కూడా వర్కవుట్స్ చేస్తుంది ఈ బ్యూటీ.

అక్కడితో ఆ వర్కవుట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అవి వైరల్ అవుతూంటాయి. ఈ క్రమంలోనే ఆ  మధ్యన బీచ్‌లో కూడా వర్కవుట్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసింది రష్మిక. అప్పుడు ఈ బీచ్ వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా మరోసారి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ పిచ్చెక్కించే పోగ్రాం పెట్టుకుందీ ఈ బ్యూటీ. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.