మొదటిసారి వచ్చిన రష్మిక డీప్ ఫేక్ వీడియో కంటే ఈ వీడియో మరింత అసభ్యకరంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పళ్లున్న చెట్టుకే రాయి దెబ్బలు అన్నట్లు క్రేజ్, అందం ఉన్న రష్మిక ఫేక్ వీడియోల బారిన పడి ఇబ్బంది పడుతోంది. గతేడాది నవంబర్‌లోనూ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన సందడి తెలిసిందే. ఆ వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ బారిన పడటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ కొలంబియా మోడల్ డానియోలా విల్లారియల్ ఇన్‌స్టా రీల్‌ను ఎడిట్ చేసి ఈ వీడియోను రూపొందించారు. ఆమె ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఈ డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల చేయటం ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో డీప్ ఫేక్ బారిన పడుతున్నారు.
హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్, కాజోల్, ప్రియాంక చోప్రా, నోరా ఫతేహిలతో పాటు సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు డీప్ ఫేక్ బారినపడ్డారు. ఇప్పుడు రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. మొదటిసారి వచ్చిన రష్మిక డీప్ ఫేక్ వీడియో కంటే ఈ వీడియో మరింత అసభ్యకరంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక డీప్ ఫేక్ బారిన పడిన సమయంలో అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
