Kompella Madhavi Latha: బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
Kompella Madhavi Latha: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి షూరు అయ్యింది.ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలుపే పరమావధిగా ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఇక ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. దీంతో అభ్యర్థులు పోటా పోటీగ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లత కూడా ఇవాళ నామినేషన్ వేశారు.
Kompella Madhavi Latha: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. గడువు ముగుస్తున్న కొద్దీ నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల నేతలు తన నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. వారి ఆస్తులు-అప్పుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ నాయకుల, పార్టీ అధినేతల ఆస్తుల వివరాల గురించి నెట్టింట్లో తెగ వెతుకున్నారు ఓటరు మహాశయులు. ఇక ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. దీంతో అభ్యర్థులు పోటా పోటీగ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లత కూడా ఇవాళ నామినేషన్ వేశారు. ఈ తరుణంలో ఆమె ఆస్తిపాస్తుల వివరాలు వైరల్ అవుతున్నాయి.
ఆమె హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన ‘విరించి’కి చైర్మన్. హిందూ భావాలు గల ఆమె నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నామినేషన్లలో దాఖాలు చేసిన వివరాల ప్రకారం.. మాధవీలత చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లు.
మాధవీలత కుటుంబ చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా వెల్లడించారు. అదే సమయంలో మొత్తం రూ.27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే.. విరించి లిమిటెడ్, వినో బయోటెక్‌లలో ఆమె పేరిట రూ.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్టు తెలిపారు.
ఇక మాధవి లత భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు, అలాగే.. అన్‌లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్‌ల్లో రూ.16.27 కోట్ల షేర్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు.
ఇక ఆభరణాల విషయానికి వస్తే.. 5 కిలోల బంగారం, ఇతర ఆభరణాలున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని ఆస్తులున్నా.. వ్యవసాయ భూములు గానీ, వాహనాలు గానీ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తనపై ఓ క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు మాధవీలత ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. మాధవీలత బరిలో నిలిచిన హైదరాబాద్ పార్లమెంట్ వర్గంలో గత 40 ఏళ్లుగా మజ్లీస్ పార్టీకే దక్కింది. మరి ఈ సారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.