Asianet News TeluguAsianet News Telugu

Animal : బాలయ్య షోలో బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్.. వైరల్ గా మారిన ఫొటో

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు తొలిసారిగా బాలీవుడ్ స్టార్ హీరో విచ్చేశారు. ఈ సందర్భంగా తాజాగా షూటింగ్ కూడా జరిగింది. దీంతో సెట్స్ నుంచి ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. 
 

Ranbir Kapoor Meets Balakrishna in the sets of Unstoppable Season 3 NSK
Author
First Published Nov 14, 2023, 5:07 PM IST

నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలయ్య (Balakrishna) ఇప్పటికీ హీరో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. యంగ్ హీరోలకు ధీటుగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. మరోవైపు బాలయ్య హోస్ట్ గానూ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోతో బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్  దక్కింది. టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులు, స్టార్ హీరోలను ఆహ్వానించి తమ పర్సనల్ లైఫ్ ను పంచుకునేలా చేశారు. బాలయ్య హ్యూమరస్ తో టీవీ ఆడియెన్స్ ను మెప్పించారు. 

ప్రస్తుతం లిమిటెడ్ వెర్షన్ గా Unstoppable 3 కూడా రన్ అవుతోంది. ఈ షోకు తాజాగా తొలిసారిగా బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) హాజరయ్యారు. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన Animal చిత్రంలో రన్బీర్ ప్రధాన పాత్ర పోషించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్  బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. 

ప్రస్తుతం సౌత్ లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దక్షిణాదిలోని ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అయ్యేందుకు ఇంటర్వ్యూలు, టాక్ షోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలుగు వారికి సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలయ్య షోకు రన్బీర్ విచ్చేశారు. ఈరోజు షూటింగ్ జరిగింది. సందీప్ రెడ్డి వంగ, రష్మిక మందన్న కూడా అన్ స్టాపబుల్ షూట్ కు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య, రన్బీర్ కలిసి ఉన్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మాస్ లుక్ లో బాలయ్య క్లాస్ గా రన్బీర్ అదరగొట్టారు. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడు రాబోతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రన్బీర్ చివరిగా ‘బ్రహ్మస్త్రం’ ప్రమోషన్స్ లో హైదరాబాద్ లో అడుగుపెట్టారు. మళ్లీ ‘యానిమల్’ ప్రచారానికి వచ్చారు.

Ranbir Kapoor Meets Balakrishna in the sets of Unstoppable Season 3 NSK

 

Follow Us:
Download App:
  • android
  • ios