టాలీవుడ్‌ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల తాను ప్రేమలో ఉన్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈవెంట్‌ ఆర్గనైజింగ్ కంపెనీ డ్యూ డ్రాప్‌ స్టూడియో అధినేత మిహికా బజాజ్‌ తనప్రేమను అంగీకరించిదని ట్వీట్ చేశాడు రానా. దీంతో టాలీవుడ్ అంతా మిహికా గురించి తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపించారు. తాజాగా మరోసారి రానా, మిహికాలు హాట్ టాపిక్‌ అయ్యారు. బుధవారం ఉదయం రానా, మిహికాల ఎంగేజ్‌మెంట్‌ ఈ రోజు అంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో మిహికా వేయించుకున్న ఓ టాటూ కూడా మీడియాలో హల్‌చల్‌ చేసింది.

ఇటీవల ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించిన యంగ్ హీరో రానా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేసుకున్నాడు. ఇక టాటూ విషయానికి వస్తే మిహికా చేతి మీద ప్రేమ చిహ్నాల మధ్య R, M అనే అక్షరాలు ఉన్న టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రానా, మిహికాల ప్రేమ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా జరగనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే బహు భాషా చిత్రంగా తెరకెక్కిన అరణ్య రిలీజ్‌కు రెడీగా ఉండగా మరికొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందనున్న భారీ పౌరాణిక చిత్రం హిరణ్య కశ్యపకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.