బాహుబలిలో శివగామిగా కనిపించిన రమ్య కృష్ణ ఆ తరువాత ఎక్కడ కనిపించినా  శివగామి అనే పేరుతో జనాలు ఇష్టంగా పిలుచుకుంటున్నారు. అంతగా ఆ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రమ్య కృష్ణ ఏ సినిమా చేసిన అందులో తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా కథలను ఎంచుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ శివగామి పోర్న్ స్టార్ గా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. 

తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలో శృంగార తారగా కనిపించడానికి రమ్య కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. సమంత - విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో లీల అనే పోర్న్ స్టార్ పాత్ర కోసం గత కొంత కాలంగా సెర్చ్ చేస్తోన్న చిత్ర యూనిట్  ఫైనల్ గా రమ్య కృష్ణను సెలెక్ట్ చేసుకుంది.

అసలైతే ముందుగా లీలా అనే ఆ పాత్ర కోసం అత్తారింటికి దారేది ఫెమ్ నదియాను సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో రమ్యకృష్ణకు పాత్ర గురించి వివరించగా ఆమె పెద్దగా ఆలోచించకుండా దర్శకుడికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శివగామి పోర్న్ స్టారా అనే ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.