మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఉపాసన సామజిక సేవా కార్యకమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రశంసలు దక్కించుకుంటోంది. ఉపాసన తనకు, రాంచరణ్ సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. 

ఇదిలా ఉండగా ఉపాసన తాజాగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఉపాసన కామినేని కొణిదెల పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపాసన కొన్ని హెల్త్ టిప్స్ చెబుతూ ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తోంది. 

రీసెంట్ గా ఉపాసన సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, సమంత లాంటి సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయడంతో సబ్ స్క్రైబర్లు వేగంగా పెరిగారు. దీనితో ఉపాసనకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లగ్ మెమెంటో లభించింది. ఈ విషయాన్ని ఉపాసన అభిమానులకు తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఈ ఘనత సాధించడానికి మీ ఆదరణే కారణం అని తెలిపింది. 

ఈ సందర్భంగా నేను మిస్టర్ సికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఏ కార్యక్రమం చేసినా మిస్టర్ సి నన్ను ప్రోత్సహిస్తున్నాడు అని ఉపాసన రాంచరణ్ ని ఉద్దేశించి తెలిపింది.