మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు లేని విధంగా ఈ సారి తన ఫుల్ ఎనర్జీని చూపెట్టబోతున్నట్లు వినయ విధేయ రామ పోస్టర్స్ తో చెప్పకనే చెబుతున్నాడు. బాక్స్ ఆఫీస్ కు దడపుట్టేలా యాక్షన్స్ సీన్స్ తోనే కలెక్షన్స్ ను రాబట్టగలనని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో స్టిల్ వైరల్ అవుతోంది. 

బి పాజిటివ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై రామ్ చరణ్ ఇచ్చిన సరికొత్త స్టిల్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక మ్యాగజైన్ లో  బాడీ ఫిట్నెస్ ఈ విధంగా మారడానికి గల సూత్రాలు ఉన్నాయట. ట్రైలర్ పచ్చబొట్టుతో కనిపించిన చరణ్ మాస్ ఆడియెన్స్ లో అంచనాలను భారీగా పెంచేశాడు. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ ఎట్రాక్షన్ తో దర్శనమిస్తుండడంతో సినిమా రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

బోయపాటి దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మించారు.