Asianet News TeluguAsianet News Telugu

Rajamouli: ఆర్టిస్ట్ ఆరోగ్యం బాగుచేయడం కోసం రాజమౌళి ప్రయత్నం.. సాయం చేయండంటూ రిక్వెస్ట్..

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి(Rajamouli ) మంచి మనసును చాటుకున్నారు. ఎంత ఎదిగినా గ్రౌండ్ లెవల్ ను మర్చిపోకూడదని మరోసారి నిరూపించారు.    తనతోపాటు పనిచేసిన ఆర్టిస్ట్ ఆరోగ్యం కోసం కాంపేయిన్ స్టార్ట్ చేశారు జక్కన్న.

Rajamouli Help To Artist Devika
Author
Hyderabad, First Published Jan 29, 2022, 12:03 PM IST

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి(Rajamouli ) మంచి మనసును చాటుకున్నారు. ఎంత ఎదిగినా గ్రౌండ్ లెవల్ ను మర్చిపోకూడదని మరోసారి నిరూపించారు.    తనతోపాటు పనిచేసిన ఆర్టిస్ట్ ఆరోగ్యం కోసం కాంపేయిన్ స్టార్ట్ చేశారు జక్కన్న.

ఒక వ్యాక్తికిస్టార్ స్టేటస్ వచ్చిన తరువాత కళ్లు నెత్తికి ఎక్కుతాయి అంటారు. చిన్న వారిని చిన్న చూపు చూడటం.. వారితో అస్సలు మాట్లాడకుండా దూరం పెట్టడం లాంటి చేస్తుంటారు.కాని వీటిన్నింటికి తాను అతీతం అనిపించుకున్నాడు..స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli ). తన తోటి  సహ కళాకారిణి దేవిక ఆరోగ్యం బాగు చేయడం కోసం తన వంతుగా ప్రయత్నం మొదలుపెట్టాడు. స్వయంగా తన సోషల్ మీడియాలో కాంపేయిన్ స్టార్ట్ చేశాడు.

తన సహచర ఆర్టిస్ట్  ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుండడం ప్రముఖ దర్శకుడు రాజౌమళి(Rajamouli ) ని కలచి వేసింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. తనతో కలసి ఎన్నో సినిమాలకు పనిచేసిన ఆమె కోసం సాయానికి పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో జక్కన్న ఇలా పోస్ట్ పెట్టారు. బాహుబలి(Bahubali) సినిమా కోసం దేవికతో కలసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కోర్డినేటర్ గా పనిచేశారు.ఆమె పని అద్భుతంగా ఉంటుంది అన్నారు.

పని పట్ల  ఆమె అభిరుచి, అంకిత భావం నిజంగా సాటిలేనివి. దురదృష్టవశాత్తూ ఆమె ఇప్పుడు  బ్లడ్ కేన్సర్ తో పోరాటం చేస్తున్నారు. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెట్టో ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి మీ వంతుగా సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాను అంటూ రాజమౌళి(Rajamouli )  పోస్ట్ పెట్టారు. ఇదే పోస్ట్ లో దేవిక తన భర్త, ఇద్దరు పిల్లలతో  కలసి తీసుకున్న ఫొటోను  కూడా శేర్ చేశారు రాజమౌళి(Rajamouli ).


రాజమౌళి(Rajamouli )  మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు. అంతే కాదు ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు  నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. అంత మంచి ఆర్టిస్ట్ ను మీరు ఎందుకు ఆదుకోలేక పోతున్నారు. బాహుబలితో పాటు ఇతర సినిమాల ద్వారా కోట్లు సంపాదించిప..మీరు  ఎందుకు సాయం చేయరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు రాజమౌళి(Rajamouli )  గారు మీరు తప్పకుండా కావాల్సినంత సమకూరుస్తారని ఆశిస్తున్నాను అంటూ మరోకరు కామెంట్ చేశారు.

ఇందులో ఎక్కువ మంది యూజర్లు రాజమౌళి(Rajamouli ) యే పెద్ద మనసుతో సాయం చేసి ఆదుకోవచ్చుగా.. ఆయన కోట్లు ఉన్నాయి కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి కూడా కింద స్థాయి నుంచే పైకి వచ్చారు. ఆయన కెరీర్ లో ఎన్ని కష్టాలు పడ్డాడో.. డబ్బుల కోసం ఎన్ని తిప్పలు పడ్డారో .. రీసెంట్ గా బాలయ్య బాబు(Balayya) అన్ స్టాపబుల్(Unstoppable) షోలో వివరంగా చెప్పారు జక్కన్న. మిడిల్ క్లాస్ మెంటాలిటీ తనది అని చెప్పిన రాజమౌళి (Rajamouli ).. ఒక ఆర్టిస్ట్ ఇంత కష్టంలో ఉంటే.. ఆదుకోకుండా ఎలా ఉంటారు..? తప్పకుండా ఆదుకుంటారు అని అంటున్నారు జక్కన్న ఫ్యాన్స్.

Follow Us:
Download App:
  • android
  • ios