Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun: కోలీవుడ్ లో అల్లు అర్జున్ కొత్త రికార్డ్.. బాహుబలి తరువాత బన్ని సినిమానే

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లిన బన్నీకి ప్రతీ భాషలో ఒక రికార్డ్ బహుమతిగా వస్తోంది.

Pushpa Movie Response in Kollywood
Author
Hyderabad, First Published Jan 29, 2022, 7:00 AM IST

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లిన బన్నీకి ప్రతీ భాషలో ఒక రికార్డ్ బహుమతిగా వస్తోంది.

అల్లు అర్జున్(Allu Arjun) - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సినమా పుష్ప. డిసెంబర్  17న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయిన ఈమూవీ.. ఫస్ట్ డే నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ తరువాత దారిలో పడిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) లుక్ డిఫరెంట్ గా కనిపించాడు.

రఫ్ అండ్ రగ్డ్ మాస్ లుక్ లో పిచ్చెక్కించాడు అల్లు అర్జున్(Allu Arjun). ఇక ఈ మూవీ అన్ని భాషల్లో దుమ్మురేపుతా ఉంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్  చేశారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఒక రేంజ్ లో జెండా ఎగరేసింది. బన్ని(Allu Arjun) ఏమైతే కలలు కన్నాడో.. ఆకలలను నిజం చేసింది పుష్ప. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లినందకు బన్నికి భారీ ఇమేజ్ ను తీసుకొచ్చింది మూవీ.  ఇక తమిళంలో కూడా అల్లు వారబ్బాయికి  కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చింది పుష్ప(Pushpa) మూవీ.

కోలీవుడ్ లో దాదాపు  30 కోట్లకుపైగా వసూలు చేసింది. బాహుబలి, బాహుబలి 2 (Bahubali) తరువాత.. అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దాంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం బన్ని పుష్ప మూవీ  సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ లో ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.

పుష్ప(Pushpa) సినిమాతో పాటు పాటకు కూడా ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా  సమంత చేసిన ఊ అంటావా మావా సాంగ్ సెన్సేషన్ అవుతోంది. దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లాస్ పాయింట్ అయ్యింది. ఇక ఫస్ట్ పార్ట్ సినిమాకంటే అంతకు మించిన ఎలిమెంట్స్ తో సెకండ్ పార్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నారు టీమ్. నెక్ట్స్ మన్త్ నుంచి పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఈ ఏడాది దసరా లోపు పుష్ప పార్ట్ 2 ను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు టీమ్.

Follow Us:
Download App:
  • android
  • ios