Asianet News TeluguAsianet News Telugu

Puri Connects : ‘లైగర్’మూవీని ప్రమోట్ చేస్తున్న సాండ్ ఆర్టిస్ట్... సర్ ప్రైజ్ అయిన ‘పూరీ’

ఓ అభిమాని లైగర్ మూవీ పోస్టర్ ను సాండ్ ఆర్ట్ వేసి తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఆర్ట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇందుకు పూరీ కనెక్ట్స్ ఆ అభిమానికి ధన్యవాదాలు తెలిపింది. 
 

Puri Connects says Thanks to Sand Artist, Social Media Post
Author
Hyderabad, First Published Jan 24, 2022, 4:32 PM IST

కొత్త సినిమాలు షూటింగ్ ప్రారంభమయ్యాయంటే చిత్ర యూనిట్ కంటే ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతారు. ఎప్పుడెప్పుడూ థియేటర్లలోకి వస్తుందని చూస్తుంటారు. సినిమా వచ్చే వరకు మౌత్ పబ్లిసిటీ చేస్తూనే ఉంటారు. త్వరలో పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘లైగర్’ మూవీ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే  ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఓ అభిమాని లైగర్ పోస్టర్  ను అచ్చుగుద్దినట్టుగా ‘సాండ్ ఆర్ట్’ వేసి  చిత్రం యూనిట్ ను షాక్ గురిచేశాడు. 

ఈ సాండ్ ఆర్ట్ ను ‘దస్రత్ మోహంత’ సాంగ్ ఆర్టిస్ట్ మూవీపై పెంచుకున్న అభిమాన్ని ఇలా ఆర్ట్ రూపంలో చూపించాడు. తాను వేసిన ఆర్ట్ ను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఆర్ట్ ను చూసిన ‘పూరీ కనెక్ట్స్’ ట్విట్ చేసింది.  తమ సినిమాపై ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. లైగర్ స్యాండ్ ఆర్ట్ అద్భుతంగా ఉందన్నారు.   మూవీ ప్రమోషన్ లో భాగంగా తాను సాండ్ ఆర్ట్ వేసినట్టు దస్రత్ వేశారు.

 

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘లైగర్ సాలా క్రాస్ బ్రీడ్’. ఈ సినిమాపై అటుు పూరీ ఫ్యాన్స్, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ఆశలు పెట్టుకున్నారు. ‘అర్జున్
రెడ్డి’ మూవీ తర్వాత ఆ రేంజ్ లో మరో మూవీ రాలేదు. ‘గీత గోవిందం’ మూవీలో చాలా డీసెంట్ గా కనిపిస్తాడు విజయ్. కానీ అప్పటికే  అగ్రేసివ్ గా ఉండే విజయ్, ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించబోతుండటంతో మరో సారి ఫ్యాన్స్ అజయ్ నుంచి మాస్ ఎలమెంట్స్, పూరీ నుంచి అదిరిపోయే పంచ్ డైలాగ్స్ కోరుకుంటున్నారు. 

ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి మొన్న వచ్చిన గ్లిమ్స్ వరకూ ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లోనూ  లైగర్ పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్యాచ్ వర్క్ కూడా మిగిలి ఉన్నాయి.  త్వరలో ఈ మూవీని నుంచి అప్డేట్ కూడా రానుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios