Asianet News TeluguAsianet News Telugu

చిన్న పాపతో అలాంటి సన్నివేశమా.. సెన్సార్‌ చీఫ్‌కు స్వరా భాస్కర్‌ రిప్లై

``రాజ్‌భరి` వెబ్‌ సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తున్న సన్నివేశం చూస్తూ చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చిత్రయూనిట్‌ ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించటం భావ ప్రకటనా స్వేచ్ఛ అనిపించుకోదు`

Prasoon Joshi upsets Rasbhari scene Swara Bhaskar Responds
Author
Hyderabad, First Published Jun 27, 2020, 2:29 PM IST

వరుస వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంట్రవర్షియల్‌ బ్యూటీ స్వరా భాస్కర్. ఈ భామ నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ రాస్‌భరి. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌లోని ఓ సన్నివేశంపై సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఛీప్‌ ప్రసూన్ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ షోలో ఓ సన్నివేశంలో ఓ చిన్ని పాప తాగుబోతుల ముందు వాళ్లను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తుంది. అయితే పిల్లలను ఇలాంటి సన్నివేశాల్లో నటింప చేయటం సరికాందటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు ప్రసూన్‌.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రసూన్‌ జోషి ఓ ట్వీట్ చేశారు. ``రాజ్‌భరి` వెబ్‌ సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తున్న సన్నివేశం చూస్తూ చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చిత్రయూనిట్‌ ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించటం భావ ప్రకటనా స్వేచ్ఛ అనిపించుకోదు` అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు.

అయితే ప్రసూన్‌ ట్వీట్‌పై స్వరా భాస్కర్‌ స్పందించింది. `మీకు ఈ సీన్‌ సరిగా అర్ధం కాలేదేమో. ఆ సన్నివేశం మీరు  అనుకున్నట్టుగా కాదు. ఆ పాప తాను ఇష్ట పూర్వకంగా డ్యాన్స్ చేస్తోంది. ఆ పాప అలా చేయటం చూసి ఆమె తండ్రి సిగ్గుపడతాడు. అంతేగాని ఆ పాప ఎవరినీ రెచ్చొగొట్టే ఉద్దేశంతో అలా డ్యాన్స్ చేయలేదు. సోసైటి తనని కూడా సెక్య్సువల్‌గా చూస్తుందన్న విషయం ఆ పాపకు తెలియదు` అంటూ రిప్లై ఇచ్చింది స్వర.

Follow Us:
Download App:
  • android
  • ios