Asianet News TeluguAsianet News Telugu

RRRలో ప్రభాస్ ... రాజమౌళి ట్రిక్?

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి చిత్రం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో మన సినిమాలకు డిమాండ్ పెరిగింది. దాంతో ఇప్పుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సైతం హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ సైతం ఈ సినిమాలోకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..

Prabhas voice over for RRR?
Author
Hyderabad, First Published Apr 14, 2019, 11:07 AM IST

ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరో లుగా నటిస్తున్నారు. ఆలియా భట్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ...అల్లూరి సీతా రామరాజుగా చరణ్‌‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా అనుకున్న ...బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రలో సరిపోయే నటి కోసం దర్శక, నిర్మాతలు చూస్తున్నారు. నిత్యా మేనన్‌ మరో కీలక పాత్ర కోసం  పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ కు కూడా స్దానం ఉందిట. తెలుగులో అల్లూరి, కొమరం పాత్రల్ని వెండితెరపై ఆయన వాయిస్‌ ఓవర్‌తోనే పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులోని ఓ పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారని అంటున్నారు. ఈ రూమర్స్  నిజమైతే.. ప్రభాస్‌ అభిమానులకు ఇది ట్రీట్‌ అని చెప్పొచ్చు. ఒకే సినిమాలో తారక్‌, చరణ్‌, ప్రభాస్‌ కనిపించడం కూడా గొప్ప విషయమే. అంతే కాదు బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా హైట్స్ కు వెల్తుంది. 

ఇక ఇదే సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించన్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios