Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ వీడియో కాల్.. మురిసిపోతోంది

ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసారని అందులో రాసుకొచ్చింది. నిర్వాణ ..బాహుబలికి ధాంక్స్ చెప్పారని పేర్కొంది. ప్రభాస్ కాల్ కు నిర్వాణ తెగ మురిసిపోయిందిట. ప్రభాస్ పెద నాన్న కృష్ణం రాజు కుటంబానికి మోహన్ బాబు కుటుంబానికి మంచి స్నేహం ఉంది. కృష్ణం రాజు పుట్టిన రోజు సందర్బంగా మొత్తం మంచు ఫ్యామిలీ హాజరయ్య..ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. అప్పుడే ప్రభాస్ కు, మంచు నిర్వాణకు మంచి ప్రెండ్షిప్ కుదిరిందిట. అందుకే ప్రభాస్ ఆ విషయం గుర్తు పెట్టుకుని పుట్టిన రోజు విషెష్ తెలియచేసారట. నిర్వాణకు జీవితాంతం గుర్తుండిపోయే గిప్ట్ కదా అది. 

Prabhas surprises Lakshmi Manchu daughter Vidya Nirvana
Author
Hyderabad, First Published Jun 17, 2020, 1:35 PM IST

టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మంచు వారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. మంచు లక్ష్మీ భర్త ప్రేమ్ ఆనంద్తో పాటు లక్ష్మీ దంపతుల గారాల పట్టి విద్యా నిర్వాణాల పుట్టిన రోజు ని ఘనంగా జరిపారు. దీంతో మిత్రులు, సన్నిహితులు వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ఆరవ పుట్టిన రోజుకి ఓ సర్పైజ్ గిప్ట్ సైతం నిర్వాణ కు అందింది. అదేమిటంటే...బాహుబలి ప్రభాస్...ఆమెకు వీడియో కాల్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయటమే.

ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసారని అందులో రాసుకొచ్చింది. నిర్వాణ ..బాహుబలికి ధాంక్స్ చెప్పారని పేర్కొంది. ప్రభాస్ కాల్ కు నిర్వాణ తెగ మురిసిపోయిందిట. ప్రభాస్ పెద నాన్న కృష్ణం రాజు కుటంబానికి మోహన్ బాబు కుటుంబానికి మంచి స్నేహం ఉంది. కృష్ణం రాజు పుట్టిన రోజు సందర్బంగా మొత్తం మంచు ఫ్యామిలీ హాజరయ్య..ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. అప్పుడే ప్రభాస్ కు, మంచు నిర్వాణకు మంచి ప్రెండ్షిప్ కుదిరిందిట. అందుకే ప్రభాస్ ఆ విషయం గుర్తు పెట్టుకుని పుట్టిన రోజు విషెష్ తెలియచేసారట. నిర్వాణకు జీవితాంతం గుర్తుండిపోయే గిప్ట్ కదా అది. 

‘నీ రాకతో నా జీవితంలో అవధులు లేని గొప్ప ప్రేమకు నిర్వచనం దొరికింది.. ఎప్పుడూ సున్నితంగా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే నీ మనసుకు ధన్యవాదాలు.. కేవలం నా జీవితం మాత్రమే కాదు, నువు టచ్ చేసిన ప్రతీ లైఫ్ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించే నువ్వు.. నిండు మనసుతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నా.. నువ్వు కోరుకున్న విజయాలు వరించాలని ఆకాంక్షిస్తున్నా.. నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు, నా నక్షత్రాలు’ అంటూ కూతురికి స్పెషల్ విష్ చేస్తూ.. స్పెషల్ ఫోటో పోస్ట్ చేసింది లక్ష్మీ ప్రసన్న.
 

Follow Us:
Download App:
  • android
  • ios