Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ వీర విహారం...  అక్కడ ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2 రికార్డ్స్ లేపేసిన కల్కి! 

కల్కి తో ప్రభాస్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆ దేశంలో కల్కి  చిత్రం ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2 వసూళ్లను అధిగమించింది. 
 

prabhas kalki 2829 Ad crosses rrr and bahubali 2 records in canada ksr
Author
First Published Jul 1, 2024, 11:33 AM IST

ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. సలార్ తో వారి దాహం పూర్తి స్థాయిలో తీరలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఊరమాస్ అవతార్ లో ప్రభాస్ ని ప్రజెంట్ చేశాడు. అయితే ప్రభాస్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటం, కథ సంపూర్ణంగా లేకపోవడంతో ఒకింత నిరాశ చెందారు. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. కానీ కలెక్టన్స్ ఫేక్ అన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో వచ్చిన కల్కి 2829 AD  క్లీన్ హిట్ అని పలువురి వాదన. వీకెండ్ ముగిసే నాటికి కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 500 కోట్లను దాటేశాయి. 

కల్కి చిత్ర కథను, దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ పేరు తెచ్చుకున్నాడు. ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు గొప్పగా ఉంది. 

ఇండియా కంటే కూడా విదేశాల్లో కల్కికి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. యూఎస్ లో కల్కి వసూళ్లు $11 మిలియన్ వసూళ్లకు చేరుకున్నాయి. ఇండియన్ కరెన్సీలో రూ. దాదాపు రూ. 92 కోట్లు. కాగా కల్కితో ప్రభాస్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. కెనడా దేశంలో కల్కి హైయెస్ట్ తెలుగు గ్రాసింగ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అంటే బాహుబలి2, ఆర్ ఆర్ ఆర్ రికార్డులు ఈ చిత్రం తుడిచి పెట్టింది. 

తెలుగు సినిమాలకు ఆదరణ లభించే ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, జర్మనీలో కూడా కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుంది.  హిందీలో కల్కి వసూళ్లు రూ. 100 కోట్ల నెట్ టచ్ చేసింది. జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్ విడుదల చేశారు. నిర్మాత అశ్వినీ దత్ రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో కల్కి నిర్మించాడు. కల్కి రన్ ముగిసే నాటికి ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో చూడాలి... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios