Asianet News TeluguAsianet News Telugu

116 మంది ప్రాణాలు పోవడానికి కారణం అతడేనా? ఎవరీ 'భోలే బాబా'?

Stampede at UP's Hathras : ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో ఇప్ప‌టివ‌ర‌కు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్య‌లో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మ‌ర‌ణాలు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. అయితే, 116 మంది ప్రాణాలు పోవడానికి కార‌ణంగా క‌నిపిస్తున్న ఈ 'భోలే బాబా' ఎవ‌రు?
 

Who is 'Bhole Baba', self-styled godman whose UP's Hathras satsang witnessed a stampede? RMA
Author
First Published Jul 3, 2024, 12:23 AM IST

Stampede at UP's Hathras :  ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం ఘోర‌ విషాదం నెలకొంది. ఇక్క‌డ జ‌రిగిన‌ ' సత్సంగ్ ' (మతపరమైన సమావేశం) సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిస‌లాట‌తో అక్క‌డిక‌క్క‌డే చాలా మంది  మరణించారు. మ‌రికొంత‌మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మ‌రింతగా మ‌ర‌ణాలు పేరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. అయితే, ఈ మ‌త‌ప‌ర‌మైన స‌మావేశం నిర్వ‌హించి అనేక మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణంగా క‌నిపిస్తున్న ఈ 'భోలే బాబా' ఎవ‌రు?

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మతపరమైన సమావేశంలో విషాదకరమైన తొక్కిసలాట ఫలితంగా 116 మందికి పైగా మరణించారు. పెద్ద సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. సాకార్ విశ్వ హరి లేదా భోలే బాబా అని కూడా పిలువబడే నారాయణ్ సకార్ హరి నిర్వహించిన సత్సంగం ముగింపులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తొక్కిసలాట గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, దీనిపై విచార‌ణ‌కు అదేశించారు.

ఎవ‌రీ భోలే బాబా? 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తియేటా ఈ హాత్రాస్ స‌త్సంగ్ ను ఇర్వ‌హిస్తారు. ఈ మ‌త‌ప‌ర‌మైన స‌మావేశానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో జ‌నాలు వ‌స్తారు. హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పుర్‌లో భోలే బాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమం సంద‌ర్భంగా గంగాజ‌లం అందిస్తారు. ఈ జ‌లాన్ని తీసుకుంటే అన్ని రోగాలు న‌య‌మ‌వుతాయ‌నీ, కొత్త రోగాలు కూడా ద‌రిచేర‌వ‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చే వారు న‌మ్ముతారు. ఈ క్ర‌మంలోనే ఈ కార్య‌క్ర‌మానికి ల‌క్ష‌లాది మంది వ‌చ్చారు.

భోలే బాబా ఎటా జిల్లాలోని పాటియాలీ తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందినవాడు. అతను పోలీసు శాఖ‌లో మాజీ ఉద్యోగి అని చెప్పుకుంటున్నాడ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మతపరమైన ప్రసంగాలు చేయడం కోసం 26 ఏళ్ల క్రితం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నేడు అత‌నికి పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో సహా భారతదేశం అంతటా అతనికి మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు.

ముఖ్యంగా, అనేక ఆధునిక మతపరమైన వ్యక్తుల మాదిరిగా కాకుండా, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అధికారిక ఖాతాలను కలిగి లేరు. అట్టడుగు స్థాయిలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేలాది మంది హాజరవుతారు. ఈ సమావేశాల సమయంలో, వాలంటీర్లు భక్తులకు ఆహారం, పానీయాలతో సహా అవసరమైన ఏర్పాట్లను చేస్తారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించడంతో భోలే బాబా ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆకర్షించారు.

తొక్కిస‌లాటలో 116 మంది మృతి.. యూపీ ప్ర‌మాదానికి అస‌లు కార‌ణాలు ఇవేనా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios