జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని తెలుగు రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటారు. అయినా కూడా ఫ్యాన్స్ పవన్ బర్త్ డేని ఘనంగా సెలెబ్రెట్ చేస్తారు. ఈ సారి సెలెబ్రేషన్స్ ఇంకాస్త ఎక్కువగా కనిపించాయి. 

తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా, విదేశాల్లో సెటిల్ అయినా ఎన్నారైలు పవన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కటింగులు, ఎర్ర కండువాలు ధరించి ర్యాలీలతో తెలుగు రాష్ట్రాలు మోతెక్కాయి. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జోరుగా కనిపించాయి. 

గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ అభిమానులు 24 గంటల్లో కోటి ట్వీట్స్ చేసి జనసేనాని బర్త్ డే విషెష్ తెలిపారు. #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్ నిన్నటి నుంచి ట్విట్టర్ ట్రెండింగ్ లో కనిపించింది. పవన్ మాత్రం ఎప్పటిలాగే తన పుట్టిన రోజున అభిమానులకు దూరంగా ఉన్నాడు. 

ఇవి కూడా చదవండి : 

పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. దద్దరిల్లిన ప్రధాన నగరాలు(వీడియోలు)

సోషల్ మీడియాలో పవన్ మేనియా.. ఇండియాలో టాప్-1 ట్రెండింగ్! 

మెగా అన్నయ్యకి ముద్దుల తమ్ముడు.. అభిమానుల పవర్ స్టార్!

పవన్ బర్త్ డే స్పెషల్.. వరుణ్ తేజ్ సర్ప్రైజ్!

పవన్ కళ్యాణ్ బర్త్ డే.. మెగాహీరోల ఎమోషనల్ పోస్ట్ లు!

పవన్ కు ఇస్మార్ట్ శంకర్ బర్త్ డే విషెస్