పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు తన 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పవన్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే మెగాహీరోలు సైతం పవన్ కి విషెస్ చెబుతున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్.. ఒక ఫ్రెండ్ గా, ఒక మెంటర్ గా, ఒక గైడ్ గా ఎప్పుడూ నాతో ఉన్నందుకు థాంక్స్.. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అంటూ పోస్ట్ పెట్టాడు. పవన్ తో తీసుకున్న ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలకు అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'RRR' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు  రానుంది. అలానే మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ పవన్ కి విషెస్ చెప్పారు.

'నా గురువు, మామా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే' అంటూ పవన్ తో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరో హీరో వరుణ్ తేజ్.. పవన్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా 'వాల్మికి' పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు.