పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 48వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అతడికి అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. ఈ రోజు పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు.

తను నటిస్తోన్న 'వాల్మీకి' సినిమాలో ఓ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా మెగాభిమానులతో పంచుకున్నారు. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఏది ఏమైనా మీతోనే ఉంటాం' అంటూ పవన్ కి విషెస్ చెప్పారు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ పాతతరం హీరో గెటప్ లో కనిపిస్తున్నారు.

ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్ వరుణ్ కి కొత్త లుక్ ని తీసుకొచ్చాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న 'వాల్మీకి' సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో ఈ జంట కలిసి 'ముకుందా' అనే సినిమాలో నటించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.