పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు స్టార్ సెలబ్రెస్టిస్ కూడా తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక యువ హీరో రామ్ పోతినేని కూడా తన స్టైల్ లో పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ ని అందించాడు.

'మీరు ఓడిపోయినా లేదా గెలిచినా అది మ్యాటర్ కాదంటూ. లోతుగా విశ్వసించినంత కాలం మీరు వన్' అంటూ రామ్ పేర్కొన్నాడు. దీంతో మెగా అభిమానులు రామ్ చేసిన స్పెషల్ ట్వీట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ గా వచ్చిన రామ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 

ఆ సినిమా సక్సెస్ తరువాత రామ్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి నెక్స్ట్ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.