జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 48వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ హంగామాతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు సందడిగా మారాయి. ఆదివారం సాయంత్రం నుంచే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అవి మీ కోసం.. 

దారి పొడవునా.. 

భీమవరం, వైజగ్ లాంటి చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు దారిపొడవునా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గాలకు ఇరువైపులా కనుచూపు మేర మొత్తం పవన్ బ్యానర్లే దర్శనం ఇస్తున్నాయి. 

40 కేజీల కేక్ 

వైజాగ్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ బర్త్ డే నిసెలెబ్రేట్ చేసుకోవడానికి 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు. 40 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 

నిలిచిపోయిన ట్రాఫిక్ 

కొన్ని పట్టణాలలో అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. పవన్ అభిమానులు జై జనసేన, పవర్ స్టార్ అంటూ నినాదాలతో మోతెక్కించారు. 

కువైట్ లో సంబరాలు 

విదేశాల్లో కూడా పీకే బర్త్ డే సెలెబ్రేషన్ ఘనంగా జరుగుతున్నాయి. కువైట్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల డాన్స్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

రాజమండ్రిలో 

రాజమండ్రి నగరంలో లోకల్ జనసేన నేతల ఆధ్వర్యంలో పవన్ జన్మదిన వేడుకలు జరిగాయి. 

ర్యాలీలు 

పవన్ పుట్టినరోజుని పురస్కరించుకుని జనసేన పార్టీ ఫండ్ కోసం పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలు, కవాతులు జోరుగా సాగాయి. జనసేన కార్యకార్తలు ర్యాలీగా బ్యాంకు వరకు వెళ్లి పార్టీకి ఫండ్ డొనేట్ చేశారు. 

గుంటూరులో జోరు 

గుంటూరు విజ్ఞాన్ కళాశాలలో అభిమానులు పవన్ నినాదాలతో హోరెత్తించారు. ఫ్లాష్ మాబ్ తో డాన్స్ చేశారు. 

భీమవరంలో కళ్ళు చెదిరేలా 

భీమవరం పట్టణంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

కర్నూలు జనసైనికులు 

కర్నూలులో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బ్యాంక్ కు వెళ్లి స్వచ్చందంగా పార్టీకి విరాళాలు అందించారు. 

పంజాబ్ లో పవన్ మానియా 

పంజాబ్ లోని ఎల్ పి యు యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ అభిమానులు 48 కేజీల భారీ కేక్ తో కళ్ళు చెదిరేలా పవన్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నారు. 

ఇవి కూడా చదవండి : 

సోషల్ మీడియాలో పవన్ మేనియా.. ఇండియాలో టాప్-1 ట్రెండింగ్! 

మెగా అన్నయ్యకి ముద్దుల తమ్ముడు.. అభిమానుల పవర్ స్టార్!

పవన్ బర్త్ డే స్పెషల్.. వరుణ్ తేజ్ సర్ప్రైజ్!

పవన్ కళ్యాణ్ బర్త్ డే.. మెగాహీరోల ఎమోషనల్ పోస్ట్ లు!

పవన్ కు ఇస్మార్ట్ శంకర్ బర్త్ డే విషెస్