పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలో ఆయనకున్న ఫాలోయింగే వేరు. నటుడిగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

తొలి ప్రయత్నంలో విజయం అందుకోలేకపోయినా.. తనవంతుగా ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. అయితే పదిహేను రోజులు ముందు నుండే పవన్ పుట్టినరోజు సందడి మొదలైంది.

బాబాయ్ పుట్టినరోజుని పురస్కరించుకొని మూడు రోజుల క్రితమే రామ్ చరణ్ కామన్ డీపీని షేర్ చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా ఇదే డీపీని ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టుకున్నారు. ఈరోజుతో పవన్ కళ్యాణ్ 48వ ఏట అడుగుపెడుతున్నారు. అయితే పవన్ బర్త్ డే మేనియా ట్విట్టర్ లో మొదలైపోయింది.

ప్రస్తుతం #HappyBirthdayPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్-1 ట్రెండింగ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ పైఎవరైనా ట్వీట్ చేస్తే చాలు రీట్వీట్‌ల మీద రీట్వీట్‌లు చేస్తున్నారు.అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం పవన్ కి విషెస్ చెబుతూ తమ ప్రేమను వ్యక్తబరుస్తున్నారు.