సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్తతో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె దర్శకురాలిగా కూడా ముద్రవేసింది.

ఆమె మరణం టాలీవుడ్ కి తీరని లోటని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంగా చేయగా.. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

విజయ నిర్మల గారి జీవితం ఎంతోమందికి మార్గదర్శకమని.. మరెంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆమె మరణవార్త తనను కలచివేసిందని.. వారి కుటుంబానికి సానూభూతిని తెలియజేశారు. హీరో సుధీర్ బాబు కూడా ఎమోషనల్ అయ్యారు.

''ఇది మా కుటుంబానికి భయానకమైన రోజు.. ఓ మార్గదర్శి, ఓ లెజెండ్, మా అమ్మలాంటి వ్యక్తి విజయనిర్మల దేవుడి దగ్గరకు పయనమయ్యారు.. ఆమెకి ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. నటి మంచులక్ష్మీ కూడా సోషల్ మీడియా వేదికగా కృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపింది. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్