MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, కూతురికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్..

Chiranjeevi: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, కూతురికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్..

మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. తన కూతురి గురించి గర్వపడుతూ.. ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాసుకొచ్చారంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 10 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
Image Credit : Asianet News

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన చిరంజీవి... తన పిల్లల్ని కూడా ఇండస్ట్రీ వైపు నడిపించారు. కొడుకు స్టార్ హీరోగా పాన్ ఇండియాను ఏలుతుంటే.. కూతురిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు మెగాస్టార్. ఇక తాజాగా చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయానికి హత్తుకునే నోట్‌ను రాశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
సుస్మితపై మెగాస్టార్ ప్రేమ..
Image Credit : Asianet News

సుస్మితపై మెగాస్టార్ ప్రేమ..

తన పోస్ట్ లో చిరంజీవి తన కూతురు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. “హ్యాపీ బర్త్‌డే నా ప్రియమైన సుస్మిత కొణిదెల. ఒకప్పుడు నా వేలిని పట్టుకుని నడిచిన చిన్నారి నుంచి, ఈరోజు బలమైన, అందమైన , బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగిన నీ ప్రయాణం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఒక తండ్రిగా నాకు ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఒకప్పుడు నా సినిమాలు చూస్తూ ఆనందపడిన నువ్వు, ఇప్పుడు ఒక సినిమా నిర్మించి నాకు గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది” అని తన సందేశంలో తెలిపారు.

Happy Birthday my precious @sushkonidela ❤️

From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.

One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ

— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026

Related Articles

Related image1
నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?
Related image2
పుష్ప సినిమా ఫేమస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె వల్లే అల్లు అర్జున్ సినిమా హిట్ అయ్యిందా?
35
తండ్రికి సూపర్ హిట్ ఇచ్చిన సుస్మిత..
Image Credit : X/@Teju_PRO

తండ్రికి సూపర్ హిట్ ఇచ్చిన సుస్మిత..

సుష్మితకు తన తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆమె ఎప్పుడూ తండ్రి వెన్నంటే ఉంటుంటుంది. ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుస్మిత.. చిరంజీవితో రీసెంట్ గా మన శంకరవరప్రసాదు గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమా సుస్మితకే కాదు.. చిరంజీవికి కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి.

45
చిరంజీవి తన సోషల్ మీడియా పోస్ట్ లో...
Image Credit : @sushmitakonidela Instagram

చిరంజీవి తన సోషల్ మీడియా పోస్ట్ లో...

ఇదే విషయాన్ని చిరంజీవి తన సోషల్ మీడియా పోస్ట్ లో ప్రస్తావిస్తూ తన కూతురిపై గర్వం వ్యక్తం చేశారు. “నీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, నీవు చేసే ప్రతి పనిలో అపార విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన హనీ పాపా, నువ్వు ఎప్పటికీ ఇలా వెలుగుతూ ఉండాలి. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమఆశీర్వాదాలు ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు.

55
ప్రేరణనిచ్చే వ్యక్తి
Image Credit : our own

ప్రేరణనిచ్చే వ్యక్తి

ఈ ఏడాది జనవరిలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సుష్మిత కొణిదెల కూడా తన తండ్రితో కలిసి పని చేసిన అనుభవాల గురించి వెల్లడించారు. తనకు జీవితంలో అత్యంత ప్రేరణనిచ్చే వ్యక్తి చిరంజీవి అని ఆమె పేర్కొన్నారు.సినిమా నిర్మాణంలో ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. ప్రతి రోజు ఆయన నుంచి కొత్త విషయం నేర్చుకోవచ్చని చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Related Stories
Recommended image1
నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?
Recommended image2
పుష్ప సినిమా ఫేమస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె వల్లే అల్లు అర్జున్ సినిమా హిట్ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved