Asianet News TeluguAsianet News Telugu

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

relation between jayasudha and vijaya nirmala
Author
Hyderabad, First Published Jun 27, 2019, 9:16 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో జన్మించారు.

ఏడేళ్ల వయసులో విజయనిర్మల భరతనాట్యం నేర్చుకున్నారు. అదే వయసులో తమిళ చిత్రం మత్స్యరేఖతో అరంగేట్రం చేశారు . 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'రంగులరాట్నం' సినిమాతో హీరోయిన్ గా మారారు.

మూడు భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. 2002లో గిన్నీస్‌ బుక్‌లో ఆమెచోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు.

అయితే విజయనిర్మలకు, నటి జయసుధకి ఉన్న రిలేషన్ గురించి చాలా మందికి తెలియదు. జయసుధకి విజయనిర్మల పిన్ని అవుతారు. ఆ కారణంగానే విజయనిర్మల ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్స్ లో జయసుధ కనిపిస్తుంటారు.  

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

Follow Us:
Download App:
  • android
  • ios