నటిగా.. దర్శకురాలిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏడో ఏటనే బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఆమె చిన్నప్పుడు దాదాపు అన్ని మగవేషాలే వేశారు.

తొలి సినిమాలో రాజకుమారుడిగా కనిపించిన ఆమె.. 'పాండురంగమహత్యం'లో పాండురంగడిగా మెప్పించారు. చినప్పుడు ఎక్కువగా మగవేషాలు వేసేదాన్ని అంటూ విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఏడో ఏటనే నటించడం మొదలుపెట్టానని... సి.పుల్లయ్య దర్శకత్వంలో ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో తీసినప్పుడు అసలు సినిమా షూటింగ్ జరుగుతుంటే ఏమీ తెలిసేది కాదని చెప్పారు.

అప్పుడు షూటింగ్ ఎక్కువగా రాత్రి పూట జరిగేదని.. నవ్వమంటే ఏడ్చేదాన్ని.. ఏడ్వమంటే నవ్వేదాన్ని అని చెప్పారు. చిన్నప్పుడు పూరి పొటాటో అంటే బాగా ఇష్టమని.. అది తీసుకొచ్చి తనకు కనపడేలా పెట్టేవారని.. దాన్ని చూడగానే నవ్వొచ్చేదని అని చెప్పారు. అలా బాలనటిగా ఐదారు సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చారు.. చిన్నప్పుడు అన్నీ మగవేషాలే వచ్చేవని.. కానీ 'భూకైలాస్'లో మాత్రం సీతగా చేశానని అన్నారు. 

ఆ తరువాత 'పాండురంగ మహత్యం'లో పాండురంగడిగా నటించినట్లు గుర్తు చేసుకున్నారు. తను నటించిన తొలి సినిమాలోనే చిన్నప్పటి రాజకుమారుడి వేషం వేసినట్లు చెప్పారు. చిన్నతనంలో బాగా అల్లరి చేసేదాన్ని అని.. ఇంట్లో గారాబంగా పెంచారంటూ అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!