ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆమె మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హీరో మంచు మనోజ్.. విజయనిర్మల మృతిపై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

''మీరు వచ్చి చరిత్ర సృష్టించారు.. మీలాంటి నటన కనబరచడం ఇంకెవ్వరి వలన కాదు.. ఇప్పుడు మీరు మా అందరిని వదిలి దూరంగా వెళ్లారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని  కోరుకుంటున్నాను'' అంటూ రాసుకొచ్చాడు. 

విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో జన్మించారు.  తొలి తెలుగు మహిళా దర్శకురాలు విజయనిర్మల.2002లో గిన్నీస్‌ బుక్‌లో ఆమె పేరు చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. 

విజయనిర్మల దర్శకత్వం వహించిన తొలి చిత్రం మీనా. ఆ సినిమా 1971లో వచ్చింది. అది మొదలు ఆమె వెనక్కి చూడలేదు. 2009 వరకు 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె సినిమాలు తీశారు. ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!