నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అయితే ఆమె నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇక ప్రియా ప్రకాష్ పనైపోయిందని అనుకున్నారు. ఆమె నటన కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో అవకాశాలు కూడా పెద్దగా రావేమోనని భావించారు.

కానీ ఇప్పుడు ఈ భామకి నితిన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా తరువాత తెలుగులో ఆమెకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని భావించింది. కానీ ప్రియా వారియర్ కి అంత సీన్ లేదని టాక్. నితిన్ సినిమాలో ప్రియా క్యారెక్టర్ తెరపై కనిపించేది కేవలం ఇరవై నిమిషాలేనట.

ఇందులో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ప్రియా పాత్ర రెండో హీరోయిన్ కంటే చాలా చిన్నదని తేలింది. కాకపోతే తెరపై కనిపించనంతసేపు ఆమె నటన ఆకట్టుకుంటుందట.

దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఆమె పాత్రను అలా డిజైన్ చేసి పెట్టుకున్నాడని సమాచారం. చంద్రశేఖర్ ఏలేటిసినిమాల్లో పాత్రలన్నింటికీ మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రియావారియర్ తెరపై కనిపించేది కాసేపైనా.. ఈ సినిమా అమ్మడుకి కలిసొస్తుందని భావిస్తున్నారు.