ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు.

విజయనిర్మల కుటుంబానికి సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

ఆమె పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు.. రోజు మొత్తం అభిమానుల సందర్శన కోసం పార్థివదేహాన్ని అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్ కి తరలిస్తారు. ఆ తరువాత ఆమెకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!