Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ ...ఇది నిజమేనా నమ్మచ్చా?

నాగార్జున వారసుడుగా అతనితో సినిమాలు చేయటానికి చాలా మంది నిర్మాతలు ఉత్సాహం చూపెడుతున్నారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో అఖిల్ స్వయంగా ముందుకు వచ్చి తనకు రెమ్యునేషన్ అక్కర్లేదని చెప్పారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

No remuneration for Akhil Akkineni for Surender Reddy film
Author
Hyderabad, First Published Aug 30, 2020, 10:51 AM IST

హీరోలు తమ రెమ్యునేషన్ ని పూర్తిగా వదులుకుని సినిమాలు చేస్తారా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే డిమాండ్ , సప్లైని బట్టి సినీ పరిశ్రమ నడుస్తూంటుంది. ఈ నేపధ్యంలో హీరోకు ఉన్న డిమాండ్ ని బట్టి అతనికిచ్చే మొత్తం నిర్మాతలు జీఎస్టీలు కట్టి మరీ ఇస్తూంటారు. లేకపోతే డేట్స్ దక్కవు అనుకునే చోట ఆ డిమాండ్ ఉంటుంది. కెరీర్ లో ఒక్క హిట్టూ లేకపోయినా అఖిల్ కు ఉన్న డిమాండ్ కు లోటు లేదు. నాగార్జున వారసుడుగా అతనితో సినిమాలు చేయటానికి చాలా మంది నిర్మాతలు ఉత్సాహం చూపెడుతున్నారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో అఖిల్ స్వయంగా ముందుకు వచ్చి తనకు రెమ్యునేషన్ అక్కర్లేదని చెప్పారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకీ ఏ సినిమాకు అంటే....

ప్ర‌స్తుతం అఖిల్ బొమ్మ‌రిల్లు  భాస్కర్ దర్శకత్వంలో  ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాకు ఓకే చెప్పాడ‌ని సమాచారం. 14 రీల్స్ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్లో తెర‌కెక్కే ఈ సినిమాకు రు. 40 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ముందుగా అఖిల్‌కు రెమ్యున‌రేష‌న్ లేద‌ని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

అందుకు కారణం ...సినిమాకు ఇప్ప‌టికే బ‌డ్జెట్ చాలా ఎక్కువ అవటమే అంటున్నారు. దానికి తోడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డికే ఏకంగా రు. 12 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. ఇక అఖిల్ కూడా రెమ్యునేషన్ తీసుకుంటే అప్పుడు బ‌డ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. మరో ప్రక్క వ‌రుస ప్లాపుల‌తో అఖిల్ మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది. అందుకే అఖిల్ ముందుగా రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా సినిమా చేసి.. త‌ర్వాత లాభాల్లో షేర్ తీసుకునేలా ఒప్పందం కుదిరింది చెప్తున్నారు. అంటే సినిమా హిట్ట‌య్యి లాభాలు వ‌స్తేనే అఖిల్ కి రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంద‌న్న‌మాట‌..!
 
మరో ప్రక్క సురేంద్రరెడ్డి వేరే స్క్రిప్టుని పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేస్తున్నారట. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఆ సినిమా తెరకెక్కించాలనే నిర్ణయంలో ఉన్నారట. అఖిల్ విషయానికి వస్తే....ప్రస్తుతం అతను నటిస్తోన్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. పరిస్థితులు మామూలు స్థితికి రాగానే మొదట విడుదలయ్యే సినిమాల వరుసలో ఈ సినిమా కూడా ఉంటుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios