Asianet News TeluguAsianet News Telugu

Nithiin: నితిన్ స్టార్ డైరెక్టర్ సినిమా రిజెక్ట్ చేశాడా.. మాస్ మూవీ మిస్ అయ్యిందే..

నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆగష్టు 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Nithiin rejects surender reddy film here is the reason
Author
Hyderabad, First Published Aug 8, 2022, 9:50 AM IST

నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆగష్టు 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ఆదివారం రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హను రాఘవపూడి, మెహర్ రమేష్ అతిథులుగా హాజరయ్యారు. గతంలో చాలా సార్లు నితిన్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ గురించి రూమర్స్ వినిపించాయి. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. 

మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సురేందర్ రెడ్డి ఆసక్తికర విషయం తెలిపారు. తాను దర్శకుడిగా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మొదట కథ చెప్పింది నితిన్ కే అని అన్నారు. దిల్ విజయం తర్వాత భయం భయంగా వెళ్లి నితిన్ కి 'అతనొక్కడే' కథ వినిపించాయి. నితిన్ కి స్టోరీ చెబుతున్నప్పుడు నా భయం మొత్తం పోయింది. 

మా కాంబినేషన్ సెట్ కాలేదు. అయినప్పటికీ ఆ ధైర్యంతో వెళ్లి అతనొక్కడే సినిమా చేశా అని సురేందర్ రెడ్డి అన్నారు. నితిన్ తో భవిష్యత్తులో తప్పకుండా మూవీ చేస్తా అని సురేందర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. అప్పట్లో సురేందర్ రెడ్డి కొత్త దర్శకుడు కాబట్టి నితిన్ ఆ కథని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమా చేస్తానంటే నితిన్ కాదంటాడా.. వెంటనే ఓకె చెప్పేస్తాడు. మొత్తానికి అలా అతనొక్కడే చిత్రం కళ్యాణ్ రామ్ ఖాతాలోకి వెళ్ళింది. 

Follow Us:
Download App:
  • android
  • ios