Asianet News TeluguAsianet News Telugu

రియల్ హీరో సోనూసూద్ పై మండిపడుతున్న నెటిజన్లు, ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటంటే...?

రియల్ హీరో, దేవుడు అని అనిపించుకున్న స్టార్ సోనూసూద్ కు కూడా ట్రోల్స్ తప్పడంలేదు. ఆయనపై విమర్షల బాణాలు ఎక్కుపెడుతున్నారు పలువురు నెటిజన్లు..ఇంతకీ నేరం ఏంటీ అంటే..? 
 

Netizens Troll on Sonu Sood Sits By The Door Of A Moving Train
Author
First Published Dec 15, 2022, 1:04 PM IST

చేతికి ఎముకలేదన్నంతగా దానాలు చేస్తూ.. రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. రీసెంట్ గా కూడా ఓ వృద్థ కళాకారుడిని ఆదుకుని మరో సారి మంచి మరసు చాటుకున్నాడు. అటువంటిది.. చాలా మంది జనాలు దేవుడిగా భావించే సోనూసూద్ పై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.. వరుసగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటీ అంటే..? 

కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకుని.. తన వంతు గా చాలామందికి సహాయం చేశాడు సోనూ సూద్. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ , రియల్‌ హీరో సోనూసూద్‌.. తన సంసాదనలో చాలా వరకూ.. ఇలా సాయం చేయడానకి ఏపయోగించాడు.   ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్‌ చేశారు. అయితే, తాజాగా సోనూ సూద్‌ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

రీసెంట్ గా సోనూసూద్‌  సోషల్ మీడియాలో  ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోనే ప్రస్తుతం ఆయన్ను విమర్షించే స్ధాయికి తీసుకోచ్చింది. ట్రైన్ లో హాయిగా సీట్ లో కూర్చోకుండా.. కదులుతున్న రైల్లో సోనూసూద్‌ ఫుట్ బోర్డుపై రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపించాడు.  హ్యాండ్‌రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. 

ఇక ఈవీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక సోషల్ మీడియలో ఇట్లాంటి న్యూస్ తెలిసే ఊరుకోరు కదా.. వెంటనే స్పందించడం మొదలు పెట్టారు. నెటిజన్లు సోనూసూద్‌పై మండిపడుతున్నారు.ఇలాంటి పనులు చేసి.. ఇంకా కుర్రాళ్ళాకు ఉత్సాహం కలిగిస్తున్నారా..? సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అంటూ.. తెగ ట్రోల చేస్తున్నారు. కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం.., ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం, ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. 

Follow Us:
Download App:
  • android
  • ios