డబ్బు ఆదా చేయాలంటే ఆడవాళ్లు చేయాల్సింది ఇదే..!
ఆడవాళ్లు డబ్బును ఆదా చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూనే ఉంటారు. నిజానికి డబ్బు ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆడవాళ్లు చాలా సులువుగా డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంట్లో ఆడవాళ్లే అన్నింటినీ చూసుకుంటారు. కుటుంబ అవసరాల నుంచి పిల్లల ఖర్చులు, నిత్యావసరాల కొనుగోళ్ల నుంచి అప్పుల వరకు అన్నీ.. ఆడవాళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. నిజానికి ఆడవాళ్లకుండే బాధ్యతలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే ఇంట్లో మగవారు సంపాదించిన డబ్బును ఆడవాళ్ల దగ్గరే పెడుతుంటారు. నిజానికి మగవారితో పోలిస్తే ఆడవారే డబ్బును ఎక్కువగా ఆదా చేస్తారు. పొదుపు చేస్తారు. కానీ చాలా ఆడవాళ్లు డబ్బును బాగా ఖర్చు పెడుతుంటారు. కొంతమంది ఆడవారికి అయితే డబ్బు పొదుపు చేసే అలవాటు కూడా ఉండదు. అందుకే ఎక్కువ సంపాదించినా, తక్కువ సంపాదించినా అందులో కొంత భాగాన్ని పొదుపు చేయాలని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. నిజానికి ఆడవాళ్లు డబ్బు ఆదా చేయడం చాలా సులువు. కొన్ని సింపుల్ స్టెప్స్ ను ఫాలో అయితే ఆడవాళ్లు చాలా డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీరు ఖచ్చితంగా డబ్బును ఆదా చేయాలనుకుంటే మాత్రం.. మీరు మొదటగా మీ జీవితంలోని ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి. ఒకవేళ మీరు అలా చేసినా మారండి. అప్పుడే మీరు డబ్బును ఆదా చేయగలుగుతారు.
ఆడవాళ్లు డబ్బును ఆదా చేయాలంటే మాత్రం ముందుగా లగ్జరీ అంటే ఏంటి? అవసరమైన ఖర్చు ఏంటో? తెలుసుకోండి. అవసరమైన వాటిని మాత్రమే కొనడానికి ప్రయత్నించండి. అనవసర ఖర్చు తగ్గించుకుంటేనే పొదుపు చేయగలుగుతారు.
ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది ఖర్చుల కోసం వేరేవారి దగ్గర విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటారు. కానీ బాకీలను కట్టడం అంత తేలికైన పని కాదు. అందుకే అప్పులు తీసుకోవడం మానేసి ఉన్నదాంట్లోనే సర్దుకోండి. ఖర్చులను తగ్గించుకోండి. దీనివల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.
చాలా మంది నెలనెలా అనవసరంగా బట్టలు కొంటూనే ఉంటారు. కానీ అవసరం లేకున్నా బట్టలను కొనడం వల్ల డబ్బు ఖర్చు అవ్వడమే తప్ప మీకొచ్చే లాభమేదీ ఉండదు.
అలాగే ప్రస్తుతం విద్యుత్ బిల్లులు కూడా బాగా పెరిగాయి. అనవసరంగా మీరు ఫ్యాన్లు, ఏసీలు, బల్బులను వాడితే కరెంట్ బిల్లు బాగా వస్తుంది. దీనివల్ల మీరు ఊహించని దానికంటే ఎక్కువ కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది. అందుకే అవసరం లేకుండా ఫ్యాన్లు, బల్బులను వేయకండి.
చాలా మంది ఇంట్లో జరుపుకునే పుట్టిన రోజులు, ఫంక్షన్లకు కూడా రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ను ఆర్డర్ చేస్తుంటారు. కానీ దీనివల్ల డబ్బు చాలా ఖర్చు అవుతుంది. మీరు ఖర్చుచేసే సగం డబ్బుతోనే ఇంట్లోనే టేస్టీ టేస్టీ ఫుడ్ ను తయారుచేయొచ్చు. డబ్బును ఆదా చేయాలనుకుంటే మాత్రం వీలైనంత వరకు ఇంట్లోనే వంట చేసి తినడం అలవాటు చేసుకోండి.
ఇలాంటి నిత్యావసరాలను తగ్గించుకోవడం వల్ల మీరు మీ పొదుపును పెంచుకోవచ్చు. అలాగే బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పిపిఎఫ్ మొదలైన వాటి ద్వారా కూడా మీరు చిన్న మొత్తాన్ని ఆదా చేయొచ్చు.
మహిళల కోసం బంగారు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం, మహిళా సంఘాలు, వేలం మొదలైన వాటి ద్వారా పొదుపు చేయడం వల్ల మీ డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఆడవాళ్ల జీవితాల్లో ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి ఇలాంటి పద్ధతులు ఎంతగానో సహాయపడతాయి.