డ్రగ్స్ ఆరోపణలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. సుశాంత్ డెత్ కేసు విచారణలో సీబీఐ రియా చక్రవర్తి మరియు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిలకు డ్రగ్ రాకెట్స్ తో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ లవ్ రియా డ్రగ్స్ కొనుగోళ్ళకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. రియాతో పాటు ఆమె తమ్ముడు షోవిక్ డ్రగ్ పెడ్లర్ లతో సంబంధాలు కలిగివున్నట్లు ఆధారాలు దొరికాయి. దీనితో వీరిద్దరిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. 

ఈ విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేసినట్లు వీరు ఒప్పుకున్నట్లు సమాచారం. అధికారులు తగు ఆధారాలతో ప్రశ్నించడంతో రియా మరియు షోవిక్ చేరిన నేరాలను ఒప్పుకున్నారట. దీనితో పాటు వీరు డ్రగ్స్ సప్లై చేసిన ప్రముఖుల పేర్లు కూడా వివరించారట. దీనితో బాలీవుడ్ కి చెందిన 25మంది ప్రముఖులకు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారట. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి అయినదట. 

మరి రియా, షోవిక్ వెల్లడించిన ఆ 25 మంది ప్రముఖులు ఎవరు, ఆ లిస్ట్ లో ఎవరు ఉన్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాగే ఎవరి పేరు బయటికి వస్తుందో అని బాలీవుడ్ ప్రముఖులు అల్లాడిపోతున్నారట. ఈ కేసు మరింత పెద్దది కానుందని తెలుస్తుండగా, బాలీవుడ్ లో కొందరు సెలబ్రెటీలకు చుక్కలు కనిపించడం ఖాయం అనిపిస్తుంది. మరో కొద్దిరోజులలో డ్రగ్స్ వ్యవహారంలో మరి కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.