మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మద్దతు ఎవరికీ ఉంటే వాళ్లే గెలుస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. 'మా'కి సంబంధించిన వ్యవహారాల్లో నందమూరి ఫ్యామిలీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వదు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ విషయంలో చిరంజీవినే ఫాలో అవుతుంటారు. ఈసారి కూడా అదే జరిగింది.

మెగాస్టార్ మద్దతు శివాజీరాజాకి ఉంటుందని భావించారు. కానీ ఆఖరి నిమిషంలో నరేష్ ప్యానెల్ వైపు మొగ్గు చూపింది మెగా కాంపౌండ్. చిరంజీవి సూచన  మేరకు నాగబాబు స్వయంగా ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు. దీంతో రిజల్ట్స్ నరేష్ కి ఫేవర్ గా వచ్చింది. చిరంజీవి మాత్రం ఎన్నికల్లో ఎవరు గెలిచినా తన మద్దతు ఉంటుందని.. డిప్లొమాటిక్ గా వ్యవహరించారు.

అయితే తెర వెనుక మాత్రం చాలానే జరిగిందని చెబుతున్నారు. మహేష్ బాబు.. చిరంజీవికి ఫోన్ చేసి నరేష్ కి మద్దతు తెలపాలని కోరారట. అంతేకాదు.. శివాజీరాజాకి వ్యతిరేకంగా చిరంజీవికి చాలా మంది ఫోన్లు చేశారట. దీంతో చిరు తన పూర్తి మద్దతు నరేష్ కి పలికారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు చేస్తూ.. అవమానించే ప్రయత్నం చేసిన శివాజీరాజాపై  నరేష్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు.

మొత్తం పోలైన ఓట్లలో నరేష్ కి 268 ఓట్లు రాగా.. శివాజీరాజాకి 199 ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో రాజేంద్రప్రసాద్, జయసుధ ఇప్పుడు నరేష్,  శివాజీరాజాల వ్యవహారాలు చూస్తుంటే ఇకపై 'మా' అసోసియేషన్ లో ఎన్నికలు తప్పేలా లేవు.  

ఇవి కూడా చదవండి.. 

'మా' ఎన్నికల ఉత్కంఠ వీడింది.. గెలిచింది వారే..!

శివాజీరాజా, నరేష్ లకు జీహెచ్ఎంసీ షాక్!

'మా' ఎలెక్షన్స్.. ఆఖరి ఓటు వేసిన అల్లరోడు!

'మా' ఎన్నికలు కౌంటింగ్ మొదలు.. గెలిచేదెవరో..?

'మా' ఎలెక్షన్స్: ఓటు హక్కు వినియోగించుకున్న తారలు!

'మా' ఎలక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్.. నరేష్ కామెంట్స్!

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు: నరేష్!

'మా' ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు!

'మా' ఎన్నికల పోలింగ్ షురూ!