మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేసిన శివాజీరాజా, నరేష్ లు ప్రత్యర్దులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈరోజ్హు ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో మా ఎన్నికలు మొదలయ్యాయి.

సుమారు 745 మంది మూవీ ఆర్టిస్ట్ లకు జరిగే ఈ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులు, దర్శకుడు కాశీవిశ్వనాథ్,  రవిబాబు, కృష్ణుడు, హీరో సునీల్, చక్రవర్తి, కమెడియన్ పృధ్వీ వంటి వారు ఛాంబర్ కి చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకొబోతున్నారు. సాయంత్రం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. రాత్రి 8 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. 

శివాజీరాజా ప్యానెల్: 

ట్రెజరర్: రాజీవ్ కనకాల 
ఉపాధ్యక్షుడు: బెనర్జీ 
ఉపాధ్యక్షుడు: ఎస్వీ కృష్ణారెడ్డి 
జాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీ 
జాయింట్ సెక్రటరీ: నాగినీడు 

నరేష్ ప్యానెల్: 

ట్రెజరర్: కోటా శంకర్ రావు 
ఉపాధ్యక్షుడు: మానిక్ 
జాయింట్ సెక్రటరీ: శివ బాలాజీ 
జాయింట్ సెక్రటరీ: గౌతం రాజు 
ఉపాధ్యక్షుడు: హరనాథ్ బాబు