మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆదివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలుగా కాగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 'మా' ప్రెసిడెంట్ పదవి కోసం శివాజీరాజా, నరేష్ లు పోటీపడ్డారు.

నరేష్ ప్యానెల్ తరఫున జీవిత, రాజశేఖర్ లు కీలక పదవుల కోసం పోటీ పడడంతో ఎన్నికల్లో యుద్ధవాతావరణం నెలకొంది. దాదాపు 800 మంది మూవీ అసోసియేషన్ సభ్యులకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి రికార్డ్ స్థాయిలో ఓట్లు నమోదు కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో నరేష్ విజయం సాధించారు.

శివాజీరాజాకి 199 ఓట్లు, నరేష్ కి 268 ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు.

హేమ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు.